ఆంధ్రప్రదేశ్‌

ఆసుపత్రులకు నిధులివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పిఎమ్.ఎస్.ఎస్.వై) పథకం కింద రాష్ట్రంలోని ఆసుపత్రుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు జెపి నడ్డా, అనిల్ మాధవ్ ధవేలతో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ భేటీ అయ్యారు. అనంతరం ఏపీ భవన్‌లో మంత్రి కామినేని విలేఖరులతో మాట్లాడుతూ మెడికల్ పీజీ విద్యార్థులకు క్వాలిఫయింగ్ మార్కులను తగ్గించడానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అంగీకరించారని వెల్లడించారు. ఎన్ని మార్కులు తగ్గించాలన్నది భారత వైద్యి విద్యా మండలి (ఎంసీఐ) నిర్ణయిస్తుందని నడ్డా పేర్కొన్నారని ఆయన తెలిపారు. ఈ మార్కులు తగ్గించడం వల్ల 29 రాష్ట్రాల వైద్య విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు. అలాగే ఏపీలో నీట్ కేంద్రాలు పెంచాలని కోరామని అన్నారు. త్వరలో ఏపీ ప్రభుత్వ అధికారులతో ఎయిమ్స్ నిర్మాణం అంశంపై సమావేశమవుతామని నడ్డా తెలి తెలిపారని అన్నారు. అలాగే పిఎమ్.ఎస్.ఎస్.వై పథకం కింద రాష్ట్రంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరినట్టు ఆయన వెల్లడించారు.