ఆంధ్రప్రదేశ్‌

పవన్ రాజకీయ ప్రణాళిక ఖరారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 20: జనసేన దళపతి పవన్ కల్యాణ్ పొలిటికల్ షెడ్యూల్ ఖరారయింది. గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా సోమవారం చేనేతల ఐక్యవేదికపై ఆయన చేసిన ప్రసంగం దీనిని స్పష్టం చేసింది. చాలాకాలం తర్వాత రాజధాని అమరావతిలో పవన్ హాజరైన బహిరంగసభ విజయవంతమయింది. ప్రధానంగా చేనేత కార్మికులు భారీ సంఖ్యలో దీనికి హాజరయి, పవన్ కోటిమందితో సమానమంటూ కీర్తించారు. బీసీలలో ఇప్పటివరకూ తెలుగుదేశం పార్టీకి మాత్రమే పట్టు ఉండగా, తాజాగా చేనేతలు నిర్వహించిన సభకు అన్ని పార్టీలనూ ఆహ్వానించినప్పటికీ, ఆ సామాజికవర్గీయులు మాత్రం పవన్ ఒక్కరినే కీర్తించి, ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం ప్రస్తావనార్హం. సోమవారం జరిగిన పవన్ బహిరంగసభలో ఆయన చేసిన ప్రసంగం పరిశీలిస్తే, పొలిటికల్‌లో సీరియస్ ఎంట్రీకి ముందు, ప్రజల్లోకి ప్రచారమాధ్యమం ద్వారా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే ముందు జనసేన వెబ్‌సైట్‌ను మార్చి 14న ప్రారంభిస్తామని ప్రకటించారు. దానికి వచ్చే స్పందనను పరిశీలించిన తర్వాత మరిన్ని రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలన్నది ఆయన యోచనగా కనిపిస్తోంది. ఇక ఎన్నికల ముందు ప్రతి పార్టీ సొంతగానే మేనిఫెస్టో తయారుచేసుకుంటుంది. కానీ పవన్ మాత్రం అందుకు విరుద్ధంగా.. ప్రజల అవసరాలేమిటో వారికి తెలిసినంత మరెవరికీ తెలియవు కాబట్టి, వాటిని మేనిఫెస్టోలో రూపొందించాల్సిందిగా పవన్ కోరి రాజకీయాల్లో కొత్త సంప్రదాయానికి తెరలేపారు.
ఇక వారసత్వ రాజకీయాలపై పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తాను వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం కాదని, అయితే ఆ పేరుతో దోపిడికి ప్రయత్నిస్తే మాత్రం వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఆయన ఎవరనుద్దేశించి చేశారన్నది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎక్కువమంది వారసులు హడావిడి చేస్తుండటం, వారసులపైనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పవన్ ఎవరిని దృష్టిలో ఉంచుకుని ఆ వ్యాఖ్యలు చేశారన్నది ఆసక్తికరంగా మారింది.
అధికారం ద్వారానే ప్రజాసేవ చేయవచ్చంటూ రాజకీయ పార్టీలు చెప్పే సూత్రాన్ని వ్యతిరేకిస్తూ, అధికారం లేకపోయినా సేవ చేయవచ్చంటూ చెప్పిన పవన్ మధ్య తరగతి, విద్యాధికులకు ఆకట్టుకున్నారు. ఇక పవన్ కేంద్రంలోని బిజెపి సర్కారుపై తన మాటల దాడిని కొనసాగించారు. చేనేతల సభలో కూడా ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా ఆయన పనిలోపనిగా రాష్ట్ర ప్రభుత్వాన్నీ తప్పుపట్టడం గమనార్హం. ఎన్నికల ముందు హామీలిచ్చి తర్వాత దానిని నెరవేర్చని వైనాన్ని ప్రత్యేకంగా తప్పు పట్టడం ద్వారా, హోదా అంశంపై తాను వెనక్కితగ్గలేదన్న సంకేతం పంపించారు. కులాల గురించి పవన్ చేసిన వ్యాఖ్యలతోపాటు, చేనేతలను ఆకక్టుకునేలా చేసిన ప్రసంగం తాను కులాలపై అవగాహనతోనే ఉన్నానన్న విషయాన్ని చాటింది. .