ఆంధ్రప్రదేశ్‌

కేంద్ర మంత్రి దత్తాత్రేయకు స్వల్ప అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 11: విశాఖపట్నం నుంచి విరామం లేకుండా రాజమహేంద్రవరం వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సోమవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఇపిఎఫ్ సబ్‌రీజినల్ కార్యాలయ శంకుస్థాపనకు సోమవారం రాత్రి రాజమహేంద్రవరం వచ్చిన ఆయన కార్యక్రమం అనంతరం సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు కడుపులో నొప్పి రావడంతో హుటాహుటిన ప్రముఖ వైద్యులు అగస్త్యరాజు శ్రీనివాసరావును పిలిపించి, పరీక్షలు చేయించారు. కొద్దిసేపటికే మరోసారి కడుపునొప్పి రావడంతో మళ్లీ ఆయనను పిలిపించి వైద్యసేవలు అందించారు.