ఆంధ్రప్రదేశ్‌

ఫేస్‌బుక్‌లో బాబుకు శ్రద్ధాంజలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 20: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చనిపోయినట్లు సృష్టించి ఫేస్‌బుక్, సోషల్ మీడియాలో శ్రద్ధాంజలి ఘటిస్తూ హల్‌ఛల్ చేస్తున్న నకిలీ ఫొటో ప్రచారంపై ఏపి హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మండిపడ్డారు. ఈమేరకు ఆయన విజయవాడలో పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మరీ ఇంత నీచ రాజకీయాలా అంటూ ఆయన తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. ‘శ్రద్ధాంజలి, నారా చంద్రబాబునాయుడు, 20-04-1950, 26-01-2017’ అంటూ చంద్రబాబు ఫొటోతో ఉన్న ప్రచారం సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో హల్‌ఛల్ చేసింది. బాబు చనిపోగా.. ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ రూపొందించిన ఫొటో జనవరి 26వ తేదీ నుంచి ప్రచారంలో నానుతోంది. దీంతో తీవ్రంగా స్పందించిన వర్ల రామయ్య సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు సోమవారం విజయవాడ పోలీసు కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. అందుబాటులో ఉన్న జాయింట్ పోలీసు కమిషనర్ పి హరికుమార్‌ను కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ‘ఈ ఏడాది జనవరి 27వ తేదీ ఉదయం 10:30 గంటలకు నా పర్సనల్ ఫెస్‌బుక్ చూస్తుండగా, నాకు అత్యంత అభిమాన నాయకుడైన నారా చంద్రబాబునాయుడు గారి ఫొటోకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లుగా ఫొటో పెట్టి, దీపారాధన చేస్తున్నట్లుగా కుందెలు వెలిగించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు చనిపోయిన వ్యక్తిగా చూపించారని, దీన్ని చూసి తీవ్ర మనోవేదనకు గురయ్యానని, ఈ లింక్ పంపించారని పరిశీలించగా ‘షేర్ చాట్’ పక్కా తెలుగువారి యాప్ అని, దొరబాబు దొర దొర అని ఉందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవిగా ఉన్న ఇలాంటి వాటిపై దర్యాప్తు చేసి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మరీ ఇంత నీచ రాజకీయాలకు పాల్పడటమా అంటూ మండిపడ్డారు. ఆరోగ్యంగా ఉన్న ముఖ్యమంత్రిని చనిపోయినట్లు ప్రచారం చేయడం ద్వారా రాజకీయంగా వారికొచ్చే ప్రయోజనమేమీ లేకపోగా.. వారి మనస్తత్వం బయటపడిందన్నారు.