ఆంధ్రప్రదేశ్‌

ఎగుమతి, దిగుమతిదారుల ప్రయోజనాలే లక్ష్యంగా ఏఈఓ పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 20: అంతర్జాతీయ వ్యాపార కార్యకలాపాలు సాగించే ఎగుమతి, దిగుమతిదారులకు కస్టమ్స్ శాఖలో నూతనంగా ప్రవేశపెట్టిన ‘ఆథరైజెడ్ ఎకనామిక్ ఆపరేటర్’ ( ఏఇఓ) పథకం ఎంతో ప్రయోజనకరమని ఆంధ్రప్రదేశ్ కస్టమ్స్ కమిషనర్ ఎస్‌కె రెహమాన్ అన్నారు. దీన్ని వ్యాపారులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎగుమతి, దిగుమతి వ్యాపారులతో కస్టమ్స్ శాఖ సోమవారం ‘కస్టమ్స్ ఆధీకృత ఆర్థిక నిర్వహణ-వ్యాపారుల ప్రయోజనాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించింది. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఏఈఓ పధకంలో వ్యాపారులకు మరింత స్వేచ్ఛ, ప్రాముఖ్యతలు లభిస్తాయన్నారు. సరుకు రవాణాలో సంస్థకు విఐపి ట్రీట్‌మెంట్, గ్రీన్ ఛానల్ మార్గం కలుగుతుందన్నారు. ఈఏఓ సర్ట్ఫికెట్ ఉంటే అంతర్జాతీయ గుర్తింపు లభించినట్లేనన్నారు. తమ వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా వ్యాపారులు కస్టమ్స్ అధికారులను కలుసుకోవాల్సిన అవసరం కనీస స్థాయికి పరిమితమయ్యేలా ఏఈఓ పధకంలో నాలుగు అంచెల ప్రమాణ గుర్తింపు పత్రం విధానం రూపొందించామన్నారు. ఎగుమతి సమయంలో కంటైనర్లు ఫ్యాక్టరీ నుంచే నేరుగా పోర్టులోకి తీసుకెళ్ళే సదుపాయంతోపాటు దిగుమతి సమయంలో సకాలంలో డాక్యుమెంట్లు నమోదు, సరుకును గిడ్డంగులకు సత్వర తరలింపు వంటి ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. వ్యాపారులకు రావాల్సిన వివిధ ప్రయోజనాలు, కేసులు వేగవంతంగా పరిష్కరిస్తారన్నారు. రిఫండ్, డ్రాబ్యాక్ వంటి ప్రోత్సాహకాలు వెనువెంటనే చెల్లిస్తారని చెప్పారు. ట్రేడ్ అభ్యర్థన మేరకు వారి ప్రాంతంలోనే కస్టమ్స్ అధికారులు సరుకును పరీక్షిస్తారని, కంటైనర్లు స్కానింగ్ చేయటంలోనూ ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఏఈఓ పధకం 180దేశాల్లో ప్రస్తుతం అమలవుతుందన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఏఇఓ ప్రయోజనాలను విపులంగా వివరించారు. సదస్సులో కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ కె రాజశేఖరరెడ్డి, సూపరిటెండెంట్లు గుమ్మడి సీతారామయ్యచౌదరి, రమణారావు, ఇన్‌స్పెక్టర్లు, పారిశ్రామిక వేత్తలు, తదితరులు పాల్గొన్నారు.