ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీ సమావేశాలకు విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 20: అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తికావచ్చాయని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం ఆయన సిఆర్‌డిఏ, పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలను మార్చి మొదటి వారంలో నిర్వహించాలని ప్రతిపాదించామన్నారు.
సమావేశాలకు హాజరయ్యే సభ్యులకు రవాణా, ఇతర వసతులు సమకూరుస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఉద్యోగులు కూడా ఇక్కడి నుంచే విధులు నిర్వహిస్తారని, వారంరోజుల్లో రానున్న వారికి వసతి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
శాసనసభ సమావేశాలకు భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు స్పీకర్‌కు డిజిపి సాంబశివరావు వివరించారు. అనంతరం డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, తదితరులతో కలిసి అసెంబ్లీ, మండలి భవనాలను కోడెల పరిశీలించారు. వివిధ పేషీలు, మంత్రుల చాంబర్లు, గ్యాలరీలను పరిశీలించి కొన్ని మార్పులు సూచించారు. విఐపిల పార్కింగ్‌కు తక్కువ స్థలం కేటాయించడంపై డిజిపి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొంత స్థలాన్ని పరిశీలించాలని సూచించారు. ధర్నాలు, ఆందోళనలు చేసేవారికి ప్రత్యేకంగా ధర్నాచౌక్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ సహా అన్ని సమస్యలపై ఈ నెల 26న స్పష్టత వస్తుందని ఆయన వివరించారు.

చిత్రం..అధికారులతో సమీక్షిస్తున్న స్పీకర్ కోడెల శివప్రసాదరావు