ఆంధ్రప్రదేశ్‌

అత్త సొమ్ము అల్లుడు దానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 21: రాజధాని నిర్మాణం పేరిట రైతుల నుంచి వేల ఎకరాల భూమిని సేకరించి వివిధ కంపెనీలకు ధారాదత్తం చేయడం అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యాలయంలో రాజధాని రైతు, రైతు కూలీల పరిరక్షణ కమిటీ సమావేశం రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఏడాదికి మూడు పంటలు పండే సారవంతమైన భూములు రైతుల నుంచి రాజధాని పేరిట తీసుకుని ఎవరికి ఇస్తున్నారని రఘువీరారెడ్డి ప్రశ్నించారు. కాలేజీలకు ఇంత భూమి అని, యోగాకు ఇంత భూమి అని, పరిశ్రమలకు అని కోట్లకు పడగలెత్తిన వారికి వందల ఎకరాల భూమిని అప్పగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లోని లక్షా 44 వేల మంది రైతుల మనోభావాల అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధానిలో ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం దారుణం అన్నారు. రాజధానిలో ఏడాది పొడవునా పోలీస్ 144, 30 సెక్షన్ నిరంతర అమలు ఏమిటి అని ప్రశ్నించారు. ఆర్టీఐ చట్టం ద్వారా రాజధాని నిర్మాణంలో ఎంత మందికి ఉపాధి, విద్య, వైద్యం, అభివృద్ధిపై ఎందుకు వివరాలు ఇవ్వడం లేదని రఘువీరారెడ్డి ప్రశ్నించారు. సిఎం అతిధి గృహానికి కూతవేటు దూరంలో రోజూ ఇసుక లారీల్లో తరలిపోతోందన్నారు. దీనిపై ఈ నెల 23న ఎపి సిఎం చంద్రబాబుకు లేఖ రాయనున్నట్లు వివరించారు. రాజధానిలోని 29 గ్రామాల్లోని రైతుల లక్షా 44 వేల మంది హక్కులు కాపాడాలన్నారు. సమావేశంలో కమిటీ చైర్మన్ బండ్ల పున్నారావు, కోఆర్డినేటర్ టిజెఆర్ సుధాకర్ బాబు, గుంటూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు పాల్గొన్నారు.