ఆంధ్రప్రదేశ్‌

పేద బ్రాహ్మణుల పెన్నిధి బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 21: పేద బ్రాహ్మణులను ఆదుకున్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని, ఆయన రుణం తీర్చుకోలేనిదని బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా కో ఆర్డినేటర్, అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి సిరిపురపు శ్రీ్ధర్, జంధ్యాల రామలింగేశ్వర శాస్ర్తీ కొనియాడారు. మంగళవారం గుంటూరు నగరంలోని శంకర్‌విలాస్ సెంటర్‌లో సిఎం చంద్రబాబు, మంత్రి మాణిక్యాలరావు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావులతో కూడిన ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఇప్పటివరకు బ్రాహ్మణుల సంక్షేమం కోసం పాటుపడిన ప్రభుత్వాలు లేవని, తొలిసారిగా దేశంలో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి బ్రాహ్మణులను చంద్రబాబు ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. అలాగే స్వాతంత్య్రానంతరం దేవాలయాలకు విచ్చేసే వంశపారంపర్య అర్చకులకు నేటి వరకు వారిని కూలీలుగానే చూశారని, సిఎం చంద్రబాబు, మంత్రి మాణిక్యాలరావు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కృష్ణారావుల కృషి ఫలితంగా వంశపారంపర్య అర్చకుల హక్కులకు దేశంలో తొలిసారిగా చట్టబద్ధత కల్పించారన్నారు. త్వరలో అర్చకులు, పురోహితులు, బ్రాహ్మణ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఆ సభలో ముఖ్యమంత్రిని ఘనంగా సన్మానించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆమంచి రవి, వేదాంతం శ్రీనివాస్, యనమదల ఆంజనేయులు, రాధాకృష్ణమూర్తి, కిషోర్ శర్మ, కొమ్మరాజు ప్రసాద్, కుమారస్వామి పాల్గొన్నారు.

చిత్రం..గుంటూరు శంకర్‌విలాస్ సెంటర్‌లో చంద్రబాబు ఫ్లెక్సీకి పాలతో అభిషేకం చేస్తున్న దృశ్యం