ఆంధ్రప్రదేశ్‌

జెఎన్‌టియు విసి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామిడి, ఫిబ్రవరి 22: అనంతపురం జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో అనంతపురం జెఎన్‌టియు వైస్ ఛాన్స్‌లర్ ఎంఎంఎం.సర్కార్(65) మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఈప్రమాదంలో సర్కార్‌తో పాటు కారు డ్రైవర్ నాగప్రసాద్(30), వ్యిక్తిగత సహాయకుడు బాబా ఫక్రుద్దీన్(32) కూడా దుర్మరణం చెందారు. కర్నూలు నగరంలోని పుల్లారెడ్డి కళాశాలలో జరుగుతున్న కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు అనంతపురం జెఎన్‌టియు వైస్ ఛాన్స్‌లర్ సర్కార్, తన వ్యక్తిగత సహాయకుడు బాబా ఫక్రుద్దీన్‌తో కలిసి బుధవారం మధ్యాహ్నం అనంతపురం నుంచి ఇన్నోవా వాహనంలో బయలుదేరారు. ఇన్నోవాను డ్రైవర్ నాగప్రసాద్ నడుపుతున్నారు. కారు పామిడి పట్టణం శివారులోని ఖల్సా ధాభా వద్దకు చేరుకోగానే టైర్ పంచరైంది. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని అవతల వైపు రోడ్డులో వస్తున్న లారీ కిందికి దూసుకుపోయింది. దీంతో ఇన్నోవా వాహనం ముందుభాగం నుజ్జునుజ్జయింది. దీంతో కారులో వెనుక వైపు కూర్చున్న విసి సర్కార్, డ్రైవర్ నాగప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. పిఎ బాబా ఫక్రుద్దీన్ కాళ్ళు ఇరుక్కుపోయి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు, పోలీసులు బయటకు తీసే ప్రయత్నం చేసే లోగానే ప్రాణాలు విడిచారు. విషయం తెలియగానే కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ రాజశేఖర్‌బాబు, జెఎన్‌టియు డైరెక్టర్ సుదర్శన్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. అనంతరం మృతదేహాలను అంబులెన్స్‌లో అనంతపురం తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు.
వైస్ ఛాన్స్‌లర్ సర్కార్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరందరికీ వివాహమైంది. కూతుళ్లలో ఒకరు వైజాగ్‌లో మరొకరు యూఎస్‌లో ఉండగా కుమారుడు ముంబాయిలో ఉన్నారు. డ్రైవర్ నాగప్రసాద్ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం దంగేవారిపల్లె. ఆరేళ్ల క్రితం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా చేరాడు. ప్రస్తుతం విసి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఈనెల 2వ తేదీ బండారు లంకకు చెందిన నాగదేవితో వివాహమైంది. పుట్టింటికి వెళ్లిన నాగదేవి భర్తకు వద్దకు బయలుదేరినట్లు సమాచారం. అంతలోనే నాగప్రసాద్ మృత్యువాతపడడంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది. వ్యక్తిగత సహాయకుడు బాబా ఫక్రుద్దీన్ స్వస్థలం అనంతపురం జిల్లా రాప్తాడు. ఇతడు జెఎన్‌టియు ఉద్యోగి. విసి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నారు. ఇద్దరి మృతితో వారి కుటుంబాల్లో సైతం విషాదం నెలకొంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పామిడి ఎస్‌ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు.

చిత్రం .. లారీ కిందికి దూసుకెళ్లడంతో నుజ్జునుజ్జయిన ఇన్నోవా

ప్రమాదంలో మృతి చెందిన జెఎన్‌టియు విసి సర్కార్