ఆంధ్రప్రదేశ్‌

సిఎం అంకెల గారడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 23: సినిమాల్లో గ్రాఫిక్స్ చూపిస్తే అందరూ ఆదరిస్తారని, అలాగని నిజజీవితంలోకూడా రాష్ట్భ్రావృద్ధిపై లెక్కల గారడీ చేసి ప్రజలను మోసగించడం తగదని సిపిఎం నేత బి వి రాఘవులు అన్నారు. ప్రజాచైతన్యబస్సు యాత్రలో పాల్గొనడానికి తిరుపతి వచ్చిన ఆయన పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. అమరావతి నిర్మాణంపై గాల్లో మేడలు కట్టడం మాని కిందిస్థాయిలో ప్రజలు పడుతున్న కష్టాలపై ఆయన దృష్టిసారించాలని సిఎం చంద్రబాబుకు హితవు పలికారు. దేవుడికి భక్తులు హుండీలో సమర్పించే కానుకలను ప్రభుత్వం దోచుకుంటోందని మండిపడ్డారు. బాబుది చేతల ప్రభుత్వం కాదని ఆయన విమర్శించారు. ముంబయి పారిశ్రామిక వేత్తల సదస్సులో రాష్ట్భ్రావృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి సిఎం స్థాయి దిగజార్చారని మండిపడ్డారు. కెసి ఆర్ వెంకన్నకు మొక్కుకున్న మొక్కులు తీర్చుకున్నాడని అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్న మొక్కులు మాట ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు.
బడుగులకు రాజ్యాధికారం కావాలి
సామాజిక న్యాయం కోసం రాజకీయ సమరానికి ప్రజా చైతన్య యాత్రతో శంఖారావాన్ని పూరించడంతో భవిష్యత్ ఉద్యమానికి పునాది పండిందని ఇది శుభపరిణామమని కులవివక్ష పోరాట సమితి జాతీయ నాయకులు, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, సామాజిక హక్కుల వేదిక రథ సారధి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఎస్సీ, ఎస్టీ,బిసి ముస్లిం, మైనార్టీ, క్రైస్తవుల హక్కుల సాధనకై జనవరి 26న ఇచ్చాపురం నుంచి ప్రారంభించిన ప్రజా చైతన్య బస్సు యాత్ర గురువారం తిరుపతికి చేరుకుంది. ఈసందర్భంగా తిరుపతిలో అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన సభలో రాఘవులు మాట్లాడుతూ ఇప్పటి వరకు సామాజిక సమస్యలపై ఎవరికి వారు పోరాటాలు చేసే పరిస్థితి కొనసాగుతూ వచ్చిందన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపుమేరకు జనచైతన్య బస్సు యాత్ర ప్రారంభమైందన్నారు. ఈ యాత్ర ఇప్పటివరకు 10 జిల్లాల్లో 126 నియోజక వర్గాల్లో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశామన్నారు. పేదల భూములు లాక్కోవాలని చూస్తే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెపుతామన్నారు.అఖిలభారత మహిళాసమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి అనిరాజా మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్రతో మరో విప్లవం ప్రారంభమైందని అన్నారు. ఇండియాను హిందూ దేశంగా మార్చాలన్న బిజెపి యత్నాలను అడ్డుకుంటామన్నారు.