ఆంధ్రప్రదేశ్‌

ఉపాధి నిధులతో సంపద సృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 23: ఉపాధి హామీ పథకం నిధులను ప్రతి శాఖ అవకాశం ఉన్నంత మేరకు సమర్థవంతంగా, జవాబుదారీతనం ఉండేలా వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.6 వేల కోట్ల వరకు ఉపాధిహామీ నిధులు ఖర్చు పెట్టగలిగామని, రానున్న ఆర్థిక సంవత్సరంలో ఇంతకుమించి రూ.7,200 కోట్ల నిధులను సద్వినియోగపరుచుకోవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు. ఉపాధిహామీ నిధులను కేంద్రీకరించి వినియోగించే అంశంపై ముఖ్యమంత్రి గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. దీనిని కేవలం ఒక్కొక్కరికి ఏడాదికి కనీసం 100 రోజులు, కరవు సమయంలో 150 రోజుల పనిదినాలు తగ్గకుండా ఉపాధి కల్పించే పథకంగానే చూడొద్దని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. గ్రామాల్లో వౌలిక సదుపాయాలు పెద్దఎత్తున ఏర్పాటు చేయడం, శాశ్వత ఆస్తులు సృష్టించడం, పేదలకు మెరుగైన జీవన వనరులు సమకూర్చడం, పంచాయతీ రాజ్ సంస్థలను బలోపేతం చేయడం వంటి ఎన్నో కార్యక్రమాలు ఉపాధి హామీ నిధులతో సాధ్యమవుతాయని అన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 4 లక్షల పంట సంజీవని కుంటలు ఏర్పాటు చేయడంతో పాటు 2 లక్షల వర్మి కంపోస్ట్ యూనిట్లు నెలకొల్పాలన్నారు. 3 వేల కిలోమీటర్ల పొడవునా రహదారుల వెంబడి మొక్కలు పెంచాలని, 4 వేల అంగన్ వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని చెప్పారు.
పల్లెలకు చెట్లే పట్టుకొమ్మలని, పల్లె పచ్చగా వుంటనేనే అందరికీ నీడ వుంటుందని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. నగర వనాల స్ఫూర్తిగా ‘పల్లెవనం’ పేరుతో గ్రామాల్లో విస్తృతస్థాయిలో మొక్కలు నాటి పెంచే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చెప్పారు. ఉపాధిహామీ నిధుల కింద మొక్కల పెంపకాన్ని చేపట్టి అటు ఉపాధి, ఇటు పచ్చదనం పెంపొందించాలని అన్నారు. అటవీ భూములు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, రహదారులకు ఇరువైపులా ఉపాధిహామీ నిధులతో మొక్కలు పెంచడంపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.