ఆంధ్రప్రదేశ్‌

మంత్రి గంటా ఆస్తుల స్వాధీనానికి నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 23: మంత్రి గంటా శ్రీనివాసరావు, అతని బంధువులకు చెందిన కొన్ని ఆస్తుల స్వాధీనానికి ఇండియన్ బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. గంటా శ్రీనివాసరావు, అతని బంధులకు చెందిన ప్రత్యూష రిసోర్సెస్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కోసం ఇండియన్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణం తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు ఈ నిర్ణయం తీసుకుకున్నారు. మంత్రి గంటా బంధువు, టిడిపి భీమిలి నియోజకలవర్గ ఇన్‌చార్జ్ పరుచూరి భాస్కరరావు సోదరుల పేరిట ప్రత్యూష కంపెనీ నడుస్తోంది. కంపెనీ అభివృద్ధి కోసం ఇండియన్ బ్యాంక్ డాబాగార్డెన్స్ బ్రాంచ్ నుంచి 2005లో 141.68 కోట్ల రూపాయల రుణాన్ని ఈ కంపెనీ తీసుకుంది. తీసుకున్న రుణం, వడ్డీ తిరిగి చెల్లించకపోవడంతో అది 196 కోట్లకు పేరుకుపోయింది. బ్యాంక్ అధికారులు బకాయిలు చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేసినా ప్రయోజనం కనిపించలేదు. దీంతో ప్రత్యూష ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రత్యూష గ్లోబల్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఆస్తులతోపాటు, కంపెనీ డైరక్టర్లు పరుచూరి రాజారావు, పరుచూరి వెంకయ్య ప్రభాకరరావు, పరుచూరి భాస్కరరావు, కొండయ్య సుబ్రహ్మణ్యం తదితరులకు చెందిన ఆస్తులను గత ఏడాది డిసెంబర్‌లో స్వాధీనం చేసుకున్నారు. 60 రోజుల్లో బకాయిలు చెల్లించాలంటూ, అదే సమయంలో బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ బ్యాంకు రుణానికి మంత్రి గంటా శ్రీనివాసరావు గ్యారంటర్‌గా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ రుణ బకాయిలు సుమారు 203 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. వీటికిగాను తమిళనాడు కాంచీపురం జిల్లా సైదాపేట తాలూకా సీషోర్‌టౌన్‌లోని ఫోలింగనల్లూరు గ్రామంలోని మూడు సర్వే నెంబర్లలో ఆరు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్‌ను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకు రంగం సిద్ధం చేసింది. అలాగే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మణికొండ జాగీర్ గ్రామంలో ల్యాంకో హిల్స్ టవర్ -5లో ఉన్న ఒక భవనాన్ని స్వాధీనం చేసుకుంటున్నట్టు ఇండియన్ బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఈ విషయమై మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం మీడియాతో మాట్లాడుతూ ప్రత్యూష కంపెనీ రుణం తీసుకున్న మాట వాస్తవమేనని, కంపెనీ నష్టాల్లో నడుస్తున్నందున బకాయిలు చెల్లించకపోవడం వలన అది ఎన్.పి. అయిందని పేర్కొన్నారు.