ఆంధ్రప్రదేశ్‌

హరహర మహాదేవ.. శంభోశంకర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, ఫిబ్రవరి 23: మహాశివరాత్రి రోజు మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు శ్రీగిరికి భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన వచ్చేవారు కొందరు, వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో వచ్చే వారు మరికొందరు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో శ్రీశైలం కిటకిటలాడుతోంది. గురువారం సాయంత్రానికి సుమారు 2 లక్షల మంది భక్తులు శ్రీగిరి చేరుకున్నారు. శుక్రవారం ఉదయానికి మరో లక్షన్నర మంది వస్తారని అంచనా వేస్తున్నారు. మహాశివరాత్రిని ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం నుంచే స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. భక్తుల దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. రాత్రి పాగాలంకరణ, అర్ధరాత్రి లింగోద్భవం, అనంతరం కల్యాణం నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దేవస్థానం వారు విస్తృత ఏర్పాట్లు చేశారు. కాలినడక భక్తులు సేదదీరేందుకు కైలాసద్వారం, పాలధార పంచధార, హఠకేశ్వరం, సాక్షిగణపతి, పాతాళగంగ, శివదీక్ష శిబిరాలు, పార్కులు, ప్రత్యేక ప్రదేశాల్లో షామియానాలు, టెంట్లు, చలువ పందిళ్లు వేశారు. ఎక్కువ మంది భక్తులు చలువ పందిళ్ళ కింద సేదదీరుతున్నారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం భక్తులు సేదదీరేందుకు సత్రాల వారు, దేవస్థానం తరపున వసతి సముదాయాల ముందు భాగంలో, పార్కుల్లో గుడారాలు వేసి వసతి కల్పించారు. కాబక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. పాతాళగంగలో ఎక్కడ చూసినా స్నానాలు చేస్తూ భక్తులు దర్శనమిస్తున్నారు. స్నానం ఆచరించిన భక్తులు రోప్‌వే, పాతమెట్ల మార్గం గుండా త్వరగా చేరుకొనేందుకు సూచనలు అందిస్తున్నారు. స్వామి అమ్మవార్లను దర్శించుకొనేందుకు వీలుగా ఆలయ వేళల్లో మార్పులు చేసి నిరంతర దర్శనాన్ని ఆలయ అధికారులు కొనసాగిస్తున్నారు. శివస్వాములకు ప్రత్యేక లైన్లు ఏర్పాటుచేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామి, అమ్మవార్లకు గజవాహన సేవ నిర్వహించారు. ఉదయం యాగశాలలో చండీశ్వరునికి ప్రత్యేక పూజలు, లోకకల్యాణం కోసం జపాలు నిర్వహించారు. శ్రీశైలం జగద్గురువు, పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్నసిద్ధరామ శివాచార్య మహాస్వామి గురువారం స్వామి అమ్మవార్లను సేవించుకున్నారు. వీరికి ఆలయ రాజగోపురం వద్ద అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
కాణిపాకం దేవస్థానం తరపున పట్టువస్త్రాలు
శ్రీకాణిపాకం వరసిద్ది వినాయక దేవస్థానం తరపున స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవానికి గురువారం పట్టువస్త్రాలు సమర్పించారు. దేవస్థానం ఇఓ పూర్ణచంద్రరావు పట్టువస్త్రాలు అందజేశారు.

చిత్రం..శ్రీశైలం పాతాళగంగ వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు