ఆంధ్రప్రదేశ్‌

చరిత్రను చెరగనివ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 23: రాజధాని పరిధిలోని 29 గ్రామాల అస్తిత్వాన్ని కాపాడుకోవాలని, పెద్దఎత్తున జరుగుతున్న అభివృద్ధి ప్రక్రియలో వాటి ఉనికి కోల్పోకుండా ఆనవాళ్లను నిలుపుకోవాలని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ సారధ్యంలోని నిష్ణాతుల కమిటీ నిర్ణయించింది. ప్రజా రాజధానిలో చిన్నారుల కోసం రూపొందించే ఆట స్థలాలు, వినోద కేంద్రాలకు సంబంధించిన నిర్మాణాలను మన ప్రాచీన క్రీడ వైకుంఠపాళి నమూనాలో వినూత్నంగా వుండేలా చూడాలని సమావేశం సూచించింది. అమరావతి రూపకల్పనలో మన చరిత్ర, సంస్కృతులను నిక్షిప్తం చేయడానికి తగు సూచనలు చేసేందుకు ఏర్పాటైన ఈ కమిటీ విజయవాడ సిఆర్‌డిఎ కార్యాలయంలో రెండోరోజు గురువారం కూడా సమావేశమై పలు అంశాలపై సమాలోచన సాగించింది. రాజధాని కోసం భూములిచ్చిన గ్రామాలు అభివృద్ధి క్రతువులో కాలగర్భంలో కలిసిపోకుండా వాటి జాడలను ఏదో ఒక రూపంలో నిక్షిప్తం చేయాలని కమిటీ అభిప్రాయపడింది. రాజధానిలోని మందడం గ్రామం ఒకనాడు ఫార్మా రంగానికి కేంద్రంగా వుండేదని, మందు అనే మాట నుంచి మందడం వచ్చిందని సమావేశంలో పాల్గొన్న చరిత్రకారులు గుర్తుచేశారు. అలాగే తుళువ గ్రామం తుళు వంశం నుంచి వచ్చిందని, రాయపూడి ఒకనాటి రాయలవారి విడిది గ్రామమని వివరించారు.
కాల్పనికతకు తావు లేకుండా చరిత్రలో వాస్తవాలను మాత్రమే తీసుకుని కొత్త నగర నిర్మాణంలో పొందుపర్చాలని, అటువంటి వివరాల సేకరణ కోసం జరిపే కసరత్తును అట్టే వ్యవధి లేనందున సాధ్యమైనంత వేగంగా పూర్తిచేయాలని కమిటీ సారధి డాక్టర్ పరకాల ప్రభాకర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతిలకు సంబంధించిన ఏ ఒక్క అంశాన్ని విస్మరించకుండా చూడాలని, అదే సమయంలో స్పష్టమైన ఆధారాలు లేని ఏ అంశాన్ని స్పృశించడం లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతం వారైనా రాజధానికి వచ్చినప్పుడు అది తన సొంత ఊరేనన్న భావన కలిగేలా అన్ని ప్రాంతాల సంస్కృతికి ప్రజారాజధాని పట్టం కట్టేలా ఉండాలన్నారు. కమిటీలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఎవరెవరు ఏఏ బాధ్యతలను నిర్వర్తించాలన్న అంశంపై ఈ సమావేశంలో పని విభజన జరిగింది. ఢిల్లీలోని రాష్టప్రతి భవన్, ప్రధానమంత్రి కార్యాలయం, సౌత్ బ్లాక్, నేషనల్ మ్యూజియంలకు ఒక బృందం వెళ్లి అక్కడ ఇంటీరియర్, సీలింగ్ డిజైన్లను పరిశీలించి రావాలని సమావేశం నిర్ణయించింది. చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపద తదితరాలన్నీ రాజధాని భవంతుల వెలుపలి భాగంలోనే ఉండాల్సిన అవసరం లేదని, భవంతుల లోపలి అలంకరణలో సైతం వీటిని పొందుపర్చవచ్చునని సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు సూచించారు. ఏటికొప్పాక, కొండపల్లి తదితర హస్తకళల వారసత్వాన్ని రాజధాని నిర్మాణంలో పొందుపర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. మూడు రాజ్యాంగ విభాగాలైన న్యాయ, శాసన, పరిపాలన వ్యవస్థలకు చెందిన భవన నిర్మాణాల్లో మన సంస్కృతి, సంప్రదాయం, చరిత్ర, వారసత్వ సంపదలు ప్రతిఫలించాలన్నారు. విద్యాశాఖకు సంబంధించిన భవన నిర్మాణాల్లో తెలుగు అక్షరమాల, వ్యవసాయశాఖకు సంబంధించిన భవంతులలో సేద్యపు రంగం విధానాల్లో వచ్చిన మార్పుల క్రమం, ఆరోగ్య వైద్యశాఖకు సంబంధించిన కట్టడాల్లో మన ప్రాచీన వైద్యశాస్త్రం, ధన్వంతరి వైద్య విధానానికి సంబంధించిన అంశాలను క్రోడీకరించాలని సూచించారు. ధాన్యకటకంలో ఉండే మూడంతస్తుల భవనాల్లోని గవాక్షాల నుంచి అక్కడకి 15 మైళ్ల దూరంలో ఉన్న కృష్ణానదీ తీరం నుంచి శీతల గాలులు తాకేవని హ్యూయాన్ త్సాంగ్ తన గ్రంథంలో రాశారని, వెలుతురు, గాలి ధారాళంగా ప్రసరించే ఆ తరహా నిర్మాణాలు కొత్త రాజధానిలో ఉండాలని సమావేశంలో పాల్గొన్న ప్రముఖ చరిత్రకారుడు, రచయిత పాపినేని సాయి అభిప్రాయపడ్డారు. గుమ్మటం, స్థంభం, కుఢ్యం, ద్వారం, దర్వాజా, గవాక్షం... వీటన్నింటి నిర్మాణం శాస్ర్తియ పద్ధతిలో, ప్రాచీన సంప్రదాయాలను అనుసరిస్తూ సాగాలని సూచించారు. స్తంభాలు ద్రాక్షారామం, సింహాచలం కప్ప స్థంభం, చేజర్ల, గుడిమల్లాం, భైరవకోన లయన్ పిల్లర్, తాడిపత్రి కట్టడాలను పోలిన విధంగా రూపొందించాలన్నారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రాజధానిలోకి దారితీసే రాజమార్గాలకు కళింగ మార్గం, వేంగి మార్గం, కాకతీయ మార్గం, పల్లవ మార్గం, విజయనగరం మార్గం, చోడరాజ మార్గం తదితర పేర్లు పెట్టాలని సమావేశంలో ఒక సూచన వచ్చింది. ముఖ్యంగా అన్ని జీవనదులు, పర్వత ప్రాంతాలు, ప్రముఖులు, వృక్ష జాతులు, రాజవంశాలకు సంబంధించిన పేర్ల జాబితాను సిద్ధం చేసి ఉంచుకోవాలని పరకాల సూచించారు. పబ్లిక్ డొమైన్ పెట్టి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలని ప్రముఖ చరిత్రకారుడు, అమరావతి హెరిటేజ్ సిటీ వ్యవస్థాపకుడు గల్లా అమరేశ్వర్ చెప్పగా, అన్ని కాలాల శీతోష్ణస్థితిని తట్టుకోగలిగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దొరికే భవన నిర్మాణ సామాగ్రినే వినియోగించాలని మరొకరు సూచించారు. సమావేశంలో రంగనాయకులు, క్రాంత్ కిరణ్ చౌదరి, ఇ.శివనాగిరెడ్డి, విజయభాస్కర్, అమరేశ్వర్, కెవి రావు, సాయి పాపినేని పాల్గొన్నారు.