ఆంధ్రప్రదేశ్‌

వేలిముద్రలు పడనివారికి ప్రత్యేకంగా రేషన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 23: రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు, ఐరిస్ పడనివారికి ప్రతినెలా 12, 13 తేదీల్లో ఒక తేదీని నిర్ణయించి ప్రత్యేకంగా రేషన్ అందించడానికి సన్నాహాలు చేస్తున్నామని, అర్హులైన ప్రతి పేదవారికి లబ్ధి చేకూర్చాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశయం అని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత చెప్పారు. పౌర సరఫరాలశాఖ ఆధ్వర్యంలో రెండురోజులపాటు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో నగదు రహిత విధానాలపై ఏర్పాటుచేసిన రాష్టస్థ్రాయి వర్క్‌షాప్‌లో గురువారం ఆమె పాల్గొన్నారు. ఈ వర్క్‌షాప్‌కు హాజరైన 13 జిల్లాల్లోని ఎఎస్‌వో, డిఎస్‌వో, డిఎంలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతపురం పాత్రికేయులతో మాట్లాడుతూ వృద్ధులకు రేషన్ షాపుల్లో ఏర్పాటుచేసిన బయోమెట్రిక్ సిస్టంలో వేలిముద్రలు, ఐరిస్ పడనివారికి నెలలో ఒక తేదీ పెట్టి రేషన్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీన్ని విఆర్‌వోలు, రేషన్ షాపుల డీలర్లు దుర్వినియోగం చేయరాదని, నిజంగా వేలిముద్రలు, ఐరిస్ పడనివారికి రేషన్ సరుకులు అందించాలని వారికి సూచించారు. దాన్ని దుర్వినియోగం చేసినట్లయితే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. నగదు రహిత విధానాలను ప్రజలు అలవాటుగా చేసుకునేలాగా ప్రోత్సహించాల్సిన అవసరం అధికారులపై ఉందని చెప్పారు. రాష్ట్రంలో కృష్ణాజిల్లా నగదు రహిత విధానాల్లో మొదటిస్థానంలో ఉందని, దీనికి కలెక్టర్ బాబు.ఎ కృషి ఉందన్నారు. ప్రజలు కూడా నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు అలవాటుగా చేసుకోవాలన్నారు. రేషన్ షాపుల్లో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను ఎన్‌ఐసి అధికారులు పరిష్కరించాలని తెలిపారు. ఎన్‌ఐసి అధికారులు సరిగా పరిష్కరించని పక్షంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. ఎన్‌ఐసి అధికారులు హైదరాబాద్ వీడి విజయవాడకు వచ్చి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్‌ఐసి సాంకేతిక ఇబ్బందులతో టూవీలర్ ఉన్నవారికి కూడా రేషన్ కార్డు రద్దవుతుందని చెబుతున్నారన్నారు. అది వాస్తవం కాదని టూవీలర్ ఉన్నా తెల్లకార్డు రద్దుకాదని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలా కార్డులు రద్దుచేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
జనవరి నెలలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో తెల్లరేషన్ కార్డులు 8 లక్షల 75వేలు మంజూరు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటీ 40 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఉన్న రేషన్ షాపుల్లో నాణ్యమైన మంచిరకం సరుకులు ప్రజలకు అందేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనంతపురంలో ఐదు మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా రాగులు అందిస్తున్నామని, ప్రజల నుంచి పెద్దఎత్తున డిమాండ్ ఏర్పడిందని చెప్పారు. రైతులు ముందుకు వచ్చి రాగులును తమ పొలాల్లో స్థానికంగా పండిస్తామని, వీటిని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నారన్నారు. రాగులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాల్లో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రాగులకు సంబంధించి ప్రజల్లో ఉన్న డిమాండ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వివరించనున్నామని తెలిపారు. జిల్లాల వారీగా జొన్నలు, సజ్జలు, రాగులు రాబోయే కాలంలో అందుబాటులోకి తెస్తామన్నారు. జూన్ 2లోపు 24 లక్షల దీపం కనెక్షన్స్ మంజూరు చేస్తామని, అడిగిన ప్రతి వారికి రాష్ట్రంలో గ్యాస్ కనెక్షన్ ఇస్తామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లోని ఏజెన్సీల్లో ఎస్‌టిలకు 5కిలోల గ్యాస్ సిలెండర్ అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. స్టేట్ లెవల్ వర్క్‌షాపులో పౌరసరఫరాల శాఖ ఎండి రామ్‌గోపాల్, డైరక్టర్ రవిబాబు, ఎన్‌ఐసి ప్రతినిధులు గురుమూర్తి, అన్నపూర్ణ, తదితర అధికారులు హాజరయ్యారు.