ఆంధ్రప్రదేశ్‌

జూన్ 18నే సివిల్స్ ప్రిలిమ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలను ఈఏడాది జూన్ 18 నే నిర్వహించాలని యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ యోచిస్తోంది. ప్రతి ఏటా ప్రిలిమినరీ పరీక్షలను యుపిఎస్‌సి ఆగస్టులో నిర్వహిస్తోంది. 2013లో ప్రిలిమినరీ పరీక్షను మే 26న నిర్వహించారు.
ఆ తర్వాత 2014, 2015, 2016లో ప్రిలిమినరీ పరీక్షను ఆగస్టులోనే నిర్వహించారు. అయితే ఈసారి 2017 ప్రిలిమినరీ పరీక్షను జూన్ 18న నిర్వహించనుంది. 27 కేటగిరిల్లోని 980 ఖాళీలను సివిల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 17 వరకూ గడువు ఇచ్చారు. మెయిన్ పరీక్ష అక్టోబర్‌లో జరిగే అవకాశం ఉంది. 21 నుండి 32 ఏళ్ల మధ్య వయస్సు వారు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు.
కెవి స్కూళ్ల ఏర్పాటు నిబంధనల సడలింపు
కేంద్రీయ విద్యాలయాల స్కూళ్ల ఏర్పాటుకు సంబంధించి నిబంధనలను ప్రభుత్వం సడలించింది. గతంలో స్కూల్ ఏర్పాటుకు నగరాల్లో 4 ఎకరాలు, గ్రామాల్లో 10 ఎకరాలు ఉండాలనే నిబంధన విధించింది.
అయితే దానిని సడలించి పట్టణాల్లో 2.5 ఎకరాల స్థలం ఉంటే పాఠశాల ఏర్పాటు చేయవచ్చని కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు.