ఆంధ్రప్రదేశ్‌

బాబును కలిసిన ఇజ్రాయల్ రాయబారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 23: వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఇజ్రాయల్ దేశ రాయబారి డానియల్ కార్మన్ గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వివిధ అంశాలపై వారు చర్చించారు. అంతర్గత భద్రత, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వ్యవసాయం, విద్య, నీరు, ఆరోగ్య రంగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందచేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధమని సిఎంకు డానియల్ తెలిపారు. సముద్రం నీటి నుంచి మంచినీరు తయారీ గురించి వివరించారు. కుప్పంలో ఏర్పాటు చేస్తున్న వ్యవసాయంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సు త్వరలోనే పూర్తి అవుతుందని వివరించారు.

చిత్రం..చంద్రబాబును కలిసిన ఇజ్రాయల్ రాయబారి డానియల్ కార్మన్

విజయవాడలో నేడు, రేపు
అంతర్జాతీయ న్యాయ సదస్సు
విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 23: జపాన్ ఎక్స్‌టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి బోర్డు ఆధ్వర్యాన విజయవాడ నగరంలో రెండురోజుల పాటు అంతర్జాతీయ న్యాయ సదస్సు జరుగనుంది. బందరురోడ్డులోని ఎ-1 కనె్వన్షన్ సెంటర్‌లో 24, 25 తేదీల్లో జరిగే ఈ సదస్సుకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టీస్ మదన్ బి లోకూర్, జస్టీస్ ఎన్‌వి రమణతోపాటు దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు హాజరుకానున్నారు. సదస్సులో మేధోసంపత్తి హక్కుల ప్రాథమిక అంశా లు, వాణిజ్య కోర్టుల చట్టాలు, డిజిటల్ యుగంలో సాక్ష్యాలు, సైబర్ నేరాలపై నూతన చట్టాలు తదితర అంశాలపై చర్చించనున్నారు. సదస్సులో ఏపి, తెలంగాణా ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథ్, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జి రోహిణి, జపాన్ హైకోర్టు న్యాయమూర్తి అభిర కటాసే తదితరులు పాల్గొని ఉపన్యసిస్తారు. ఈకార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరై ప్రత్యేక ఉపన్యాసం చేయనున్నారు.