ఆంధ్రప్రదేశ్‌

విదేశీ పర్యాటకులను ఆకర్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 24: రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి విస్తృతం కావాలంటే విదేశీ పర్యాటకుల ఆకర్షణ లక్ష్యంగా వౌలిక సదుపాయాలు, వసతులు కల్పిచాలని పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో ఎపి వెనుకబడి ఉందని, ప్రత్యేక పర్యాటక ప్యాకేజీలతో వీరిని ఆకట్టుకోవాలని టూర్ ఆపరేటర్లతో విశాఖలో శుక్రవారం జరిగిన సమావేశంలో అభిప్రాయపడ్డారు. గత ఏడాది భారత్‌ను సందర్శించిన విదేశీ పర్యాటకులు 85 లక్షలు కాగా, వీరిలో కేవలం 4 శాతం మాత్రమే ఎపిలో పర్యాటక ప్రాంతాలను సందర్శించారన్నారు.
పర్యాటకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన విశాఖ కంటే చిత్తూరు, అనంతపురం జిల్లాలను సందర్శించిన పర్యాటకులు 2.6 లక్షల మంది ఉన్నారన్నారు. చిత్తూరు జిల్లాలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధి, అనంతపురం పుట్టపర్తికి విదేశీ సందర్శకులు పెద్ద ఎత్తున వచ్చారన్నారు. నవ్యాంధ్రలో పర్యాటక రంగానికి ఊతమిచ్చే పలు అంశాలు ఉన్నప్పటికీ సరైన ప్రచారం లేకపోవడం వల్లే పర్యాటకులను ఆకర్షించడంలో వెనుకబడ్డామని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తోందన్నారు. నవ్యాంధ్రలో పర్యాటకాభివృద్ధి లక్ష్యంగా ఐదు ప్రాంతాలను టూరిజం హబ్‌లుగా అభివృద్ధి పరుస్తున్నట్టు వెల్లడించారు. విశాఖ, రాజమండ్రి, అమరావతి, నెల్లూరు, అనంతపురం ప్రాంతాల్లో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. విశాఖలో రిసార్ట్స్ నిర్మాణం, రాజమండ్రి, కోనసీమలో రివర్ టూరిజంలో భాగంగా లగ్జరీ క్రూయిజ్‌ల ఏర్పాటు, భవానీ ఐలాండ్‌లో వాటర్ స్పోర్ట్స్, నెల్లూరు, తిరుపతిలో పులికాట్ సరస్సు, రాయలసీమలో టైగర్ ప్రాజెక్టులను చేపట్టనున్నామన్నారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు పెద్దఎత్తున వౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రభుత్వ,ప్రైవేటు విధానంలో హాటళ్లు, రిసార్ట్‌లను అభివృద్ధి చేయనుందన్నారు.
వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో ఐదు నక్షత్రాల స్థాయి కలిగిన 1000 గదులను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఇప్పటికే ఎంఒయులు కుదుర్చుకున్నామన్నారు. అలాగే క్రూయిజ్ టూరిజం అభివృద్ధికి భీమిలి, కాకినాడ, భవానీ ఐలాండ్, కళింగపట్నం లేదా మైపాడుల్లో జెట్టీలను నిర్మించేందుకు ప్రతిపాదించామన్నారు.