ఆంధ్రప్రదేశ్‌

ప్రాజెక్టుల పరిహారంలో తెగని పీటముడులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఫిబ్రవరి 24: రాష్టవ్య్రాప్తంగా జరుగుతున్న వివిధ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల సందర్భంగా ప్రకటిస్తున్న పరిహారాలు కొందరికి మోదం, మరికొందరికి ఖేదం కలిగిస్తున్నాయి. చిత్రంగా ఒక్కో ప్రాజెక్టు పరిధిలో ప్రకటించిన పరిహారం అక్కడి రైతులకు సంతృప్తిని కలిగించకపోగా, వేరే ప్రాజెక్టు పరిధిలోని రైతులు తమకు అదే ప్యాకేజీ ఇవ్వాలని కోరుతుండటం విశేషం. కొన్ని సందర్భాల్లో ఈ పరిహారం వ్యవహారంలో పీటముడి పడుతోంది. మొత్తం మీద ప్రతీ ప్రాజెక్టు పరిధిలో ప్రకటించిన పరిహారం కంటే మెరుగైన పరిహారాన్ని నిర్వాసితులు కోరుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్వాసితుల భూములకు నిర్ణయించిన ధర పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నెత్తిన పాలుపోసినట్టయ్యింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు సంబంధించి ఎకరానికి రూ.28 లక్షల వరకు పరిహారం ప్రకటించారు. అయితే ఈ మొత్తం అక్కడి రైతులకు అంగీకారయోగ్యం కాదు. వారు పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మించిన పట్టిసం ఎత్తిపోతల ప్రాజెక్టు సందర్భంగా కొందరు రైతులకు ఇచ్చిన తరహాలో భారీ మొత్తాన్ని ఆశిస్తున్నారు. ఇదిలావుంటే పురుషోత్తపట్నం రైతులకు ప్రకటించిన ధర ప్రకారం తమకు ఎకరాకు రూ.33.6 లక్షల వరకు పరిహారం చెల్లించాల్సివుంటుందని ఇదే జిల్లాలో పోలవరం ప్రాజెక్టు కారణంగా భూములు కోల్పోతున్న రైతులు కోరుతున్నారు. షెడ్డూల్డు ప్రాంతానికి ఆనుకునివున్న సీతానగరం మండలంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో కొత్త భూసేకరణ చట్టంలోని 28(ఎ) నిబంధనను అనుసరించి ఎకరానికి రూ.28 లక్షల 20వేలు ధరను ప్రభుత్వం నిర్ణయించింది. షెడ్డూలు ప్రాంతంలోని గోదావరి తీర ప్రాంతాలైన దేవీపట్నం, కూనవరం, వర రామచంద్రపురం, చింతూరు, ఎటపాక భూములు ఎంత సారవంతమైనవో, సీతానగరం మండలంలోని భూములు కూడా అంతే సారవంతమైనవి కావడంతోపాటు ఒకేవిధమైన స్వరూపాన్ని కలిగివున్నాయి. ఒకే రకమైన పంటలు పండుతాయి. కొత్త భూసేకరణ చట్టం సెక్షన్ 28 ప్రకారం పురుషోత్తపట్నం గ్రామ ప్రజలకు నిర్ణయించిన ధరను తమకూ చెల్లించాలని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు కోరుతున్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని రికార్డు సమయంలో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. పోలవరం ప్రాజెక్టు సైతం 2018 నాటికి పూర్తిచేస్తామని ప్రకటిస్తున్నారు. ఇలాంటి తరుణంలో పరిహారం వ్యవహారాలు ఎప్పటికి పరిష్కారమవుతాయో అనే సందేహం వ్యక్తమవుతోంది.