ఆంధ్రప్రదేశ్‌

2 కోట్ల మందితో ప్రత్యేక హోదా ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, ఫిబ్రవరి 24: ప్రత్యేక హోదా కోసం రెండు కోట్ల మందితో ఈనెల 26వ తేదీ ప్రజాబ్యాలెట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. శుక్రవారం అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2017 సంవత్సరాన్ని ఉద్యమ నామసంవత్సరంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ప్రత్యేక హోదా కోసం రైతు ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. హోదా రావడం వల్ల యువతకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయన్న అంశాలపై చైతన్యవంతులను చేసే తాము చేపట్టే ఉద్యమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు, ఎక్కడ జరిగినా స్థానిక సమస్యలపైనే ప్రభావితం చేసి అక్కడి నేతలను గెలిపిస్తారని, అలాంటి ఎన్నికలకు ఎంపి, ఎమ్మెల్యేల ఎన్నికలతో ఎలాంటి సంబంధం ఉండదన్నారు.
పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమి ఖాయమని రఘువీరారెడ్డి జోస్యం చెప్పారు. ప్రధాని ఎన్ని హామీలు ఇచ్చినా అక్కడి ప్రజలకు పార్టీపై విశ్వాసం లేదన్నారు. ఓటమి తప్పదన్నారు. ఇప్పటికైనా బిజెపి గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తగిన గుణపాఠం తప్పదన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, జిల్లా కార్యదర్శి సొరంగాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. పిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి