ఆంధ్రప్రదేశ్‌

మారని వైద్యుల చేతి రాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 24: ప్రజల ఆరోగ్య పరిరక్షణలో క్రియాశీలక పాత్ర వహించే వైద్యులు ఉన్నత విలువలను కాపాడేలా ప్రధానంగా వైద్య పరీక్షలు, శస్తచ్రికిత్సలో పారదర్శకత ఉండేలా కేంద్ర ప్రభుత్వం మారుతున్న కాలానుగుణంగా ఎప్పటికప్పుడు చట్టాలు చేస్తున్నది. అయితే ఆ చట్టాలు కొందరి పాలిట చుట్టాలుగా మారుతున్నాయి. వైద్య పరీక్ష అనంతరం మందుల వినియోగం కోసం డాక్టర్లు రాసిచ్చే ప్రిస్కిప్షన్‌లో మందుపేరు ఆంగ్ల భాషలో విడివిడిగా పెద్ద అక్షరాల్లో ఉండాలి. అంటే మెడికల్ షాపు గుమాస్తాకే కాక సాధారణ రోగికి సైతం ఆ మందు ఏమిటో అర్థమయ్యేలా ఉండాలి. ఈమేర జాతీయ ఆరోగ్య పరిరక్షణ కేంద్ర మంత్రిత్వశాఖ ఎన్నో సంవత్సరాల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. అయితే అత్యధిక మంది వైద్యులు రాసిన మందు పేరు ఏమిటో ఆయన సూచించే మెడికల్ షాపు వారికి మినహా బ్రహ్మదేవుడికి కూడా ఏ మాత్రం అంతుబట్టడం లేదు. సాధారణంగా డాక్టర్‌కి, మందుల షాపువారికి మధ్య ఓ అవగాహన ఉంటుంది. 2002 ప్రాంతంలో ఈ చేతిరాతపై స్పష్టమైన ఆదేశాలతో మరోమారు గెజిట్ నోటిఫికేషన్ కూడా వెలువడింది. ఇక మెడికల్ షాపులో విధిగా ఫార్మాసిస్టు ఉండాలి. అతను లేకుండా ఎలాంటి అమ్మకాలు జరుగరాదు. అయితే అత్యధిక షాపుల యజమానులు ఎక్కడో ఉద్యోగాలు చేసే ఫార్మాసిస్టులకు నెలకు నిర్ణీత రుసుం చెల్లించి అతని సర్ట్ఫికెట్‌ను మాత్రం గోడకు తగిలిస్తున్నారు. డాక్టర్ల రాత ఎవరికీ అర్థం కాకపోతుండటంతో షాపులవారు తెలివిగా కమీషన్ ఎక్కువ వచ్చే మరో మందును అంటకట్టి ఒకవేళ ఎవరైనా అదేమని ప్రశ్నిస్తే అదే కాంబినేషన్‌తో కూడినదని డాక్టర్‌కు బాగా తెల్సంటూ బుకాయిస్తుంటారు. ఇక మందును ఏ ఏ సమయాల్లో వాడాలనే దానికి స్పష్టంగా ఆ ప్రిస్కిప్షన్‌లో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అని రాయాల్సి ఉండగా ఆ స్థానంలో ఇంటూ మార్కులు పేర్కొంటున్నారు. అదే టానిక్ అయితే ఎన్ని మూతలు వాడాలనే దానిపై కూడా స్పష్టంగా రాసి ఉండాలనే నిబంధన కూడా ఉంది. ఏది ఏమైనా చట్టప్రకారం ప్రిస్కిప్షన్‌లో వైద్యుల చేతిరాత స్పష్టంగా ఉండేలా ఇటు వైద్య ఆరోగ్యశాఖతో పాటు మెడికల్ అసోసియేషన్లు కూడా తగు చర్యలు తీసుకుంటే బాగుంటుంది.