ఆంధ్రప్రదేశ్‌

1 నుంచి చైనీస్ ఫిల్మ్ ఫెస్టివల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కల్చరల్), ఫిబ్రవరి 24: విజయవాడ ఫిలిమ్ సొసైటీ తమ సభ్యుల కోసం మార్చి 1 నుండి 5 వరకు చైనా దేశపు చలన చిత్రాలను ప్రదర్శించనున్నది. విజయవాడ ఫిలిమ్ సొసైటీ నిర్వహించే ఈ ఫిలిమ్ ఫెస్టివల్ ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి, ఎంబసీ ఆఫ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, ఫెడరేషన్ ఆఫ్ ఫిలిమ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా (సదరన్ రీజియన్) వారు సహకరిస్తున్నారని కార్యదర్శి జంపా కృష్ణకిషోర్ ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 1న 6 గంటలకు జరిగే సభా కార్యక్రమానికి విజయవాడ ఫిలిమ్ సొసైటీ ఉపాధ్యక్షులు ఎన్‌వివి నాగరాజు అధ్యక్షత వహిస్తారు. విజయవాడ కల్చరల్ సెంటర్‌లో 1వ తేదీ క్రౌచింగ్ టైగర్, హిడెన్ డ్రాగన్, 2తేదీ లెటజ్ గెట్ మ్యారీడ్, 3న ది డెడ్ ఎండ్, 4న లేడీ ఆఫ్ ది డైనెస్టి, 5న ది మాస్టర్ చిత్రాల ప్రదర్శన ఉంటుందని కృష్ణకిషోర్ తెలిపారు.