ఆంధ్రప్రదేశ్‌

కల్తీని అరికట్టే నాథుడేడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 24: ప్రజారోగ్యాన్ని హరింప చేస్తున్న అమ్మకాల విషయం అటుంచి ఆహార పదార్థాల కల్తీని అట్టడుగు స్థాయి నుంచి పూర్తిస్థాయిలో అరికట్టే నాథుడు కన్పించటం లేదు. ఆరోగ్యశ్రీ పథకం కింద తెల్లకార్డుదారులకు, హెల్త్‌కార్డుల ద్వారా ఉద్యోగులు, తాజాగా అన్ని స్థాయిల్లోని వారికి ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వందలు, వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నది. తాజాగా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వపరంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి పూనుకుంటున్నది. అయితేనేమి ఆహార పదార్థాల కల్తీ నివారణ పట్ల ప్రత్యేక శ్రద్ధ ఏ స్థాయిలోనూ కన్పించడం లేదు. రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లు కావస్తున్నా హైదరాబాద్ నాచారంలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబ్ విభజన జరుగలేదు. నేటికీ శాంపిల్స్‌ను అక్కడికి పంపించాల్సి వస్తున్నది. వాస్తవానికి గల్లీ గల్లీ తిరిగే పోలీస్ బీట్ కానిస్టేబుల్‌కు, అలాగే వీధి వీధిని పరిశుభ్రపరిచే మున్సిపల్ శానిటరీ సిబ్బందికి తెలియకుండా ఆహార పదార్థాల కల్తీ జరుగదు. అలాంటిది ఏకంగా పెద్ద పెద్ద గోదాముల్లోనే కల్తీ జరుగుతుండటం విజయవాడ, సహా పలు జిల్లాల్లో ఇటీవల పోలీస్‌శాఖ నిర్వహించిన దాడులు తేటతెల్లం చేస్తున్నాయి. పోలీసులు ఆర్భాటంగా దాడులు జరుపుతున్నప్పటికీ ఆ కేసులు న్యాయస్థానాల్లో నిలవటం లేదు. ఇటీవల కొన్ని దాడుల్లో పోలీసులు శాంపిల్స్ తీసి సరుకును సీజ్‌చేసి, పలువురిని అరెస్ట్ చేసి ఆపై విచారణ జరిపి కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసిన సందర్భాల్లో ‘మీకు ఏమి అధికారాలున్నాయంటూ’ కేసులు కొట్టివేస్తున్నాయి. ప్రస్తుత చట్ట ప్రకారం శాంపిల్స్ తీసి సరుకు సీజ్‌చేసి విచారణ జరిపే అధికారం కేవలం ఫుడ్ ఇన్‌స్పెక్టర్లకు మాత్రమే ఉంది. అయితే స్థానిక శానిటరీ సిబ్బంది లేదా పోలీసుల సహాయం తీసుకోవచ్చు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు పంపిన శాంపిల్స్ కల్తీగా నిర్ధారించిన సందర్భాల్లో పోలీస్ శాఖ ద్వారా నిందితులపై క్రిమినల్ కేసులు దాఖలుచేసే అధికారాలున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఒక గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్, ఇద్దరు నాన్ గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు పనిచేస్తున్నారు. వీరి అజమాయిషీ చూసే రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కార్యాలయం నేటికీ హైదరాబాద్‌లోనే కొనసాగుతున్నది. ఆ కార్యాలయాన్ని తరలించడంతోపాటు ఆహార కల్తీ నియంత్రణ కోసం పోలీస్‌శాఖ, మున్సిపల్ శానిటరీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల మధ్య సమన్వయం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలీసులు గాని, లేదా శానిటరీ సిబ్బంది గాని తమ వద్దనున్న సమాచారాన్ని జాయింట్ కలెక్టర్ల ద్వారా ఫుడ్ ఇన్‌స్పెక్టర్లను తమ వెంట బెట్టుకుని దాడులు చేయగల్గినప్పుడే కల్తీని నియంత్రించగల్గుతాం.