ఆంధ్రప్రదేశ్‌

శివరాత్రి స్నానాల్లో అపశృతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 24: తూర్పు గోదావరి జిల్లాలో శుక్రవారం గోదావరి నదిలో శివరాత్రి స్నానాలు ఆచరించే చోట అపశృతి చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో విద్యుత్ షాక్‌కు గురై ఒక వ్యక్తి మృతిచెందాడు. గొలగోటి రాంబాబు (32) విద్యుత్ షాక్‌కు గురికాగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. కోరుకొండ మండలం రాఘవపట్నానికి చెందిన రాంబాబు భార్య, పిల్లలతో కలిసి పుష్కర ఘాట్‌కు స్నానం ఆచరించేందుకు వచ్చాడు. పుష్కర ఘాట్‌లోని భద్రకాళీ మాత ఆలయం వద్ద విద్యుత్ స్తంభాన్ని ఆనుకోవడంతో విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా ట్రాఫిక్ ఇబ్బందుల మధ్య అంబులెన్స్ సకాలంలో పుష్కర ఘాట్‌కు చేరుకోలేదు. సుమారు నలభై నిముషాల్లోగా అక్కడకు చేరుకున్న అంబులెన్స్‌లో అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వైసిపి నాయకుల రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. దీంతో సుమారు నాలుగు గంటల పాటు లాలాచెరువు నుంచి ట్రాఫిక్ స్తంభించింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బందువులకు సాయంత్రం అప్పగించారు. ఆందోళనకు దిగిన వైసిపి నాయకులను పోలీసులు అరెస్టుచేశారు.