ఆంధ్రప్రదేశ్‌

సినీ నటుడు సుమన్‌కు బిరుదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 24: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం సుబ్బరామిరెడ్డి, శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ నటుడు సుమన్‌కు ఆధ్యాత్మిక నట ప్రవీణ బిరుదు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్వర్ణ కంకణధారణతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా టిఎస్సార్ సాగరతీరంలో కోటి శివలింగాల కుంభాభిషేకం నిర్వహిస్తుండడం ముదావహ మన్నారు. మంత్రి గంటా మాట్లాడుతూ వ్యాపారవేత్తగా పేరొందిన టిఎస్సార్ ఆథ్యాత్మిక, కళాసేవారంగాల్లో మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.

చిత్రం..సుమన్‌కు బిరుదు ప్రదానం చేస్తున్న టిఎస్సార్, స్వరూపా నందేంద్ర, మంత్రి గంటా