ఆంధ్రప్రదేశ్‌

దేశంలో డిజిటల్ విప్లవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 24: దేశంలో డిజిటల్ విప్లవం ఊపందుకుంటోందని, త్వరలోనే ఇది అన్ని రంగాలకు విస్తరించనుందని స్టీల్ ప్లాంట్ సిఎండి పి మధుసూదన్ చెప్పారు. డిజిటల్ ఇండియా ఇన్ గ్లోబల్ ఐటి స్పెక్ట్రమ్ అన్న అంశంపై కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా, విశాఖ స్టీల్‌ప్లాంట్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగే అంతర్జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సదస్సులో మధుసూదన్ మాట్లాడుతూ డిజిటలైజేషన్ అనూహ్యంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవలసి ఉంటుందని అన్నారు. డిజిటలైజేషన్ వలన దేశంలోని అన్ని రంగాలు విప్లవాత్మకమైన అభివృద్ధి సాధించనున్నాయని ఆయన చెప్పారు. డిజిటలైజేషన్ నిత్య జీవితంలో ఒక భాగమైపోనుందని ఆయన వివరించారు. డిజిటలైజేషన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయని అన్నారు. ఆర్థిక వ్యవస్థకు డిజిటలైజేషన్ అనుసంధానమవడం వలనే మొబైల్ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిగిపోతున్నాయని ఆయన చెప్పారు. విద్యా, నైపుణ్య రంగాల్లో కూడా డిజిటలైజేషన్ గణనీయమైన పాత్ర పోషించనుందని మధుసూదన్ వివరించారు. 2025 నాటికి దేశంలోని 24 మిలియన్ హైస్కూల్స్‌లో, 18 నుంచి 33 మిలియన్ ఒకేషనల్ కళాశాలల్లో డిజీ ప్రభావం కనిపిస్తుందని ఆయన చెప్పారు. వైద్య రంగంలో కూడా డిజిటలైజేషన్ మంచి ఫలితాలను తీసుకురాబోతోందని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ఐటి అడ్వైజర్ జెఎ చౌదరి మాట్లాడుతూ ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా ఇన్నోవేషన్, ఇంటిగ్రేషన్, ట్రాన్స్‌ఫార్మింగ్ గురించే మాట్లాడుకుంటున్నారని అన్నారు. తయారీ రంగంలో రోబోట్స్ సేవలను వినియోగించుకోవడం వలన ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని, కొత్త ఉద్యోగాలు రావడం లేదని అన్నారు. దీంతో దేశంలోని నిరుద్యోగులు పెరిగిపోతున్నారని చెప్పారు. దేశంలో ఉన్న వనరులు హరించుకుపోతున్న తరుణంలో నిరుద్యోగ సమస్య కూడా దానికి తోడైతే భవిష్యత్ అంధకారమైపోతుందని చెప్పారు. ఉద్యోగకల్పన బాధ్యత కేవలం ప్రభుత్వంపైనే లేదని, పారిశ్రామికవేత్తలపై కూడా ఉందని ఆయన చెప్పారు. సమీప భవిష్యత్‌లో చోటు చేసుకునే వాతావరణ పరిస్థితులను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వలన తెలుసుకోగలుగుతున్నామని చౌదరి చెప్పారు. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా రీజనల్ వైస్ ప్రెసిడెంట్ కంచుభట్ల రాజు మాట్లాడుతూ 4.0 విధానం వలన ఉద్యోగాలు తగ్గిపోతున్నాయని అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతర దేశాల్లో వినియోగిస్తున్నామని, అది మన దేశంలోనే వినియోగించుకుంటే అద్భుత ఫలితాలను సాధించవచ్చని చెప్పారు. ఇప్పటి వరకూ మనం డాలర్ల రుచి చూశాం. దీని నుంచి బయటపడాలని ఆయన కోరారు. త్వరలోనే 5జి టెక్నాలజీ అందుబాటులోకి రాబోతోంది. దీన్ని అందిపుచ్చుకోడానికి అవసరమైన సాంకేతికతతో మనం సిద్ధంగా ఉండాలన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న స్టీల్ ప్లాంట్ సిఎండి మధుసూదన్