ఆంధ్రప్రదేశ్‌

మానవత్వమే బౌద్ధమత సారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (నాగార్జున విశ్వవిద్యాలయం), ఫిబ్రవరి 24: సామాజిక విప్లవాన్ని కాంక్షించిన బుద్ధుని బోధనలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం వర్శిటీలోని డైక్‌మెన్ ఆడిటోరియంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్- బుద్ధిజం అనే అంశంపై రెండురోజుల పాటు జరిగే అంతర్జాతీయ సదస్సులో మంత్రి ముఖ్యఅతిధిగా ప్రసంగించారు. కార్యక్రమానికి పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అధ్యక్షత వహించారు. మంత్రి రావెల మాట్లాడుతూ భారతదేశంలో అణగారిన వర్గాల విముక్తి కోసం అంబేద్కర్ బుద్ధుని అడుగుజాడల్లో మహోజ్వలమైన పోరాటం చేశారని గుర్తుచేశారు. దేశంలో అధిక సంఖ్యాకులైన ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు బుద్ధిజం మార్గనిర్దేశం తీసుకుందని అన్నారు. సమానత్వాన్ని ప్రధాన అంశంగా తీసుకున్నందునే అంబేద్కర్ బుద్ధిజం పట్ల ఆకర్షితులయ్యారని తెలిపారు. భారతీయ సమాజంలో అసమానతలు తొలగి సర్వమానవులు సమానం అన్న భావనతో శ్రేయోరాజ్యం సాధించేందుకు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ 125 జయంత్యుత్సవాల్లో భాగంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అంబేద్కర్- బుద్ధుని తాత్వికతపై సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి సాంఘిక సంక్షేమశాఖ అనేక కార్యక్రమాలు చేపడుతోందని, ఇందులో భాగంగానే అంబేద్కర్, బుద్ధుని ఆశయాలతో యువతను చైతన్య పరిచేందుకు ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే నరేంద్ర మాట్లాడుతూ బుద్ధుని ఆలోచనా విధానంపై దేశీయ విశ్వ విద్యాలయాల్లో మరింత పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. నూతన రాజధాని నిర్మాణంలో బుద్ధుని కాల జ్ఞాపకాలను పదిల పరిచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. అనంతరం సదస్సుకు సమర్పించిన పరిశోధనా పత్రాల సంకలనాలను మంత్రి రావెల ఆవిష్కరించారు. కొలంబియా యూనివర్శిటీకి చెంది ఆకాశ్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ దేశీయ సమాజంలో మార్పులు తీసుకువచ్చేందుకు అంబేద్కర్ బోధనలు ఉపయోగపడతాయన్నారు. అంబేద్కర్ తాత్విక పునాదుల మీదే దేశంలో సామాజిక విప్లవం సాధ్యపడుతుందన్నారు. అంబేద్కర్‌పై విదేశీ వర్శిటీలలో జరిగిన పరిశోధనలు దేశీయంగా జరక్కపోవటం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో విజయవాడ మునిసిపల్ కమిషనర్ వీరపాండియన్, నాగార్జున యూనివర్శిటీ బుద్ధిజం విభాగాధిపతి ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపరాణి, ప్రొఫెసర్ రామ్‌కుమార్ రత్నం, డాక్టర్ కొచ్చర్ల అనిల్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సదస్సులో మాట్లాడుతున్న మంత్రి రావెల