ఆంధ్రప్రదేశ్‌

పేదలకు నీడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న భారీ గృహ నిర్మాణ పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం శంకుస్థాపన చేయనున్నారు. అందరికి గృహాలు అన్న పథకం పేరుతో రాష్ట్రంలో ఆరు లక్షల మంది పేద, బడుగు, బలహీన వర్గాల వారికి గృహాలు నిర్మించనున్నారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా గురువారం విజయవాడ రూరల్ మండలం జక్కంపూడిలో గృహ నిర్మాణ పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో రెండు లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 1.93 లక్షల గృహాల ఇప్పటికే ప్రభుత్వం మంజూరు చేసింది. వీటితోపాటు మరో రెండు లక్షల ఇళ్ళను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మొత్తం ఆరు లక్షల ఇళ్ళను ప్రభుత్వం నిర్మించనుంది. ఈ శంకుస్థాపనను పురస్కరించుకుని ఒక పైలాన్‌ను నిర్మిస్తున్నారు. ఈ ఇళ్ళను జి ప్లస్ 3, జి ప్లస్ 5, జి ప్లస్ 7 విధానంలో ఇళ్ళను నిర్మించనున్నారు. ఒక్కో ఇంటికి సుమారు ఐదున్నర లక్షల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ఇళ్ళ నిర్మాణ బాధ్యతను జపాన్ సంస్థకు అప్పగించినట్టు తెలిసింది. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టెక్నాలజీతో ఈ ఇళ్లను నిర్మించనున్నారు.