ఆంధ్రప్రదేశ్‌

కొత్త అసెంబ్లీలోనైనా సంప్రదాయాలు పాటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రారంభమయ్యే కొత్త శాసనసభలోనైనా సంప్రదాయాలను పాటించి సభను సజావుగా నడిపించాలని వైఎస్‌ఆర్‌సిపి శాసనసభ్యుడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. గత మూడేళ్లగా ప్రతిపక్షానికి శాసనసభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అడ్డుకున్నారని, అమరావతిలోనైనా సభా సంప్రదాయాలను పాటించి ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశమివ్వాలని కోరారు. శనివారం నాడిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు.
అతి తక్కువ రోజులు అసెంబ్లీ సమావేశాలు ఎపిలోనే జరుగుతున్నాయని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకన్నా, దావోస్ పర్యటనలకే ప్రభుత్వం అధికంగా వెచ్చిస్తోందని తెలిపారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో కరువు, పంటల బీమా, రుణ మాఫీ, 13 శాతం వ్యవసాయాభివృద్ధి, రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రధానంగా అసెంబ్లీలో చర్చిస్తామని అన్నారు. ప్రాజెక్టుల అంచనాలు పెంపుదల, వాటిలో అవినీతివంటి వాటిని సమావేశాల్లో ఎత్తిచూపుతామని అన్నారు. పార్టీ ఫిరాయింపుల అంశం, స్విస్ చాలెంజ్ విధా నం, రాజధాని భూసేకరణ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు.
జన్మభూమి కమిటీలు చేస్తున్న అరాచకాలు, ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీ సంక్షేమ శాఖల నిర్వీర్యంపైనా సభలో లేవనెత్తుతామని తెలిపారు. ఎవరు చేయి ఎత్తితే వారికి అవకాశం ఇచ్చి గంటల తరబడి తిట్టించే కొత్త సంప్రదాయానికి స్పీకర్ శ్రీకారం చుట్టారని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. సభను హుం దాగా నడిపించాల్సిన బాధ్యత స్పీకర్, సిఎం మీదే ఉంటుందని అన్నారు.