ఆంధ్రప్రదేశ్‌

నకిలీ ఆడిటర్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, ఫిబ్రవరి 25: నకలీపత్రాలు సృష్టించి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన నకలీ ఆడిటర్‌ను శనివారం మదనపల్లె పోలీసులు అరెస్టుచేసి, వారివద్ద నుంచి కంప్యూటర్లు స్వాధీనం చేసుకుని, బ్యాంకు లాకర్లు సీజ్‌చేశారు. మదనపల్లె రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ విలేఖరులతో మాట్లాడుతూ తమిళనాడుకు చెందిన రవీంద్రనాధ్ గుప్త కొంతకాలంగా మదనపల్లె పట్టణంలో ప్రభుత్వ అనుమతితో ఓ చిన్న ఆడిటర్ కార్యాలయానికి ఏర్పాటు చేసుకున్నారు. రవీంద్రనాధ్ మృతి చెందిన అనంతరం డిగ్రీ పూర్తిచేసిన ఆయన కుమారుడు శ్రీనాధ్ (41) ఆడిట్ కార్యాలయం కొనసాగించాడు. తన వద్దకు వచ్చే ఉద్యోగులు, వ్యాపారులు ఇన్‌కంటాక్స్ రిటన్స్ ఫైల్ చేసే సమయంలో శ్రీనాథ్ ఫోన్ నెంబర్, ఇమెయిల్, బ్యాంకు ఖాతా నెంబర్ సమర్పించేవాడు. ఇన్‌కమ్ ట్యాక్స్‌కు తప్పుడు నివేదికలతోపాటు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి, ప్రభుత్వం నుం చి విడుదలైయ్యే రిటర్న్ పైకం తన ఖాతాలోకి జమచేసుకుంటున్నట్లు ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఇటీవల గుర్తించారు. నిఘావేసి జనవరి 24న అతని కార్యాలయంపై దాడి చేశారు. ప్రాథమిక విచారణలో ఆదాయపన్నుశాఖకు నకిలీ ధ్రువపత్రాలు పెట్టి రూ.1.53కోట్లు నష్టం కలిగించాడని బట్టబయలైంది. అందులో అప్పటికే రూ.66లక్షల, 18వేల,700రూపాయలు స్వాహా చేసినట్లు విచారణలో తేలింది. అం దులో రూ.10లక్షలు షేర్ మార్కెట్‌కు బదిలీచేసేందుకు బ్యాం కు ఖాతాలో ఉన్న పైకంను పోలీసులు సీజ్‌చేశారు.
అనంతరం ఫిబ్రవరి 3న తిరుపతి ఇన్విస్టిగేషన్ అధికారులు దాడులు చేసి అక్రమంగా సంపాధించిన విలువైన ఆస్తుల పత్రాలు, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నా రు. అనంతరం మదనపల్లె ఆదాయపుపన్నుశాఖ అధికారి ఎ సత్యనారాయణ మదనపల్లె రెండవ పట్టణ సిఐకు ఫిర్యాదు చేయడంతో ఈనెల 22న కేసున మోదుచేసి, శనివారం పట్టణంలోని సుబాష్‌రోడ్డు వీధిలోని తన ఇంటివద్ద ఆడిటర్‌ను అరెస్టుచేసినట్లు సిఐ హనుమంతనాయక్ తెలిపారు.