ఆంధ్రప్రదేశ్‌

సిఎం ఆరోగ్య కేంద్రాలకు త్వరలో శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 25:4ఆరోగ్యంగా ఉంటేనే ఆనందం - ఆనందంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం2 అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం అమరావతిలోని తన నివాసం నుంచి వైద్య, ఆరోగ్యశాఖల అధికారులు, జిల్లాల కలెక్టర్లు, పంచాయతీరాజ్, పురపాలక శాఖల అధికారులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా రూపొందించడంలో భాగంగా గ్రామాలు, వార్డుల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలన్నారు. డయేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, తదితర వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
రాష్ట్రంలో త్వరలోనే 173 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించనున్నట్లు సిఎం చంద్రబాబు పేర్కొన్నారు. డ్వాక్రా మహిళలే వీటిని నిర్వహిస్తారని, చౌక ధరకు అందుబాటులో అన్ని రకాల మందులు ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల ద్వారా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 3ఆరోగ్య రక్ష2కు మరింత ప్రచారం కల్పించాలన్నారు. దరఖాస్తుల గడువు ఏప్రిల్ 6వ తేదీకి పొడిగించినందున దీన్ని మరింతమంది సద్వినియోగం చేసుకునేలా శ్రద్ధ వహించాలన్నారు.
ఆరోగ్యరక్ష (యూనివర్సల్ హెల్త్‌కేర్) సాధించిన తొలి గ్రామం, తొలి మండలం, ప్రథమ జిల్లాకు ప్రపంచ ఆరోగ్యదినం సందర్భంగా అవార్డులు అందించనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఆరోగ్యంపై ప్రజలను చైతన్యపరిచిన వ్యక్తులు, సంస్థలకు అవార్డులిచ్చి సత్కరిస్తామన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా విశాఖ జిల్లాలో 3మనం-మన గ్రామం-మన శుభ్రత2 విజయవంతం చేసిన పంచాయతీరాజ్ శాఖను, అధికారులను అభినందించారు. చంద్రన్న బీమా2 పరిహారం సకాలంలో అందించడంలో వైద్యాధికారులు సహకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. డెత్ సర్ట్ఫికెట్లు, పోస్ట్‌మార్టం రిపోర్టుల జారీలో రోజుల తరబడి జాప్యం జరగరాదని చెప్పారు. ఐదు రోజుల్లోనే డెత్ సర్ట్ఫికెట్లు, పోస్టుమార్టం రిపోర్టులు ఇవ్వాలన్నారు. ఉద్దానంలో ఐదు మండలాల్లో బోర్‌వెల్స్ వేయడం పూర్తిచేశారని, అదే ఉత్సాహంతో పనిచేసి డిస్పెన్సింగ్ యూనిట్ల నిర్మాణం మార్చి 31 లోపు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఎన్టీఆర్ సుజల ప్లాంట్ల ఏర్పాటుకు 100 చ.గ. స్థలం ఆయా గ్రామాల్లో త్వరితగతిన కేటాయించాలని ఆదేశించారు. ఉద్దానం ప్రాంతంలోని 46 గ్రామాల్లో 15 ప్రత్యేక సంచార వైద్య బృందాలు 29వేల మందిని స్క్రీన్ చేశారంటూ మిగిలిన 68 గ్రామాలను కూడా వెంటనే పూర్తిచేయాలన్నారు. వైద్యఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ ఈ ఏడాది ఇప్పటివరకు ఎన్టీఆర్ వైద్య పరీక్షల2కింద 49,94, 270 మందికి ల్యాబ్ పరీక్షలు ఉచితంగా జరిపామన్నారు. 4,37,321 మందికి ఉచిత ఎక్స్‌రే పరీక్షలు చేసి టెలి రేడియాలజీ సేవలు అందించామన్నారు.
21,913 మందికి సిటి స్కాన్ పరీక్షలు జరిపామన్నారు. చంద్రన్న సంచార చికిత్స2 కింద ఇప్పటివరకు 33,38,384 మంది రోగులకు వైద్యసేవలు అందించినట్లు చెప్పారు. 9,41,551 మందికి ల్యాబ్ టెస్టులు చేశామన్నారు. తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్2 ద్వారా 2,50,704 మంది బాలింతలకు ఉచిత రవాణా సదుపాయం కల్పించామన్నారు. 102 కాల్‌సెంటర్ల ద్వారా 8లక్షల మందికి సలహాలు అందించామని, ఎన్టీఆర్ బేబి కిట్లు2 1,46,734 మం దికి అందించామని తెలిపారు.