ఆంధ్రప్రదేశ్‌

మన్నించుమా... శ్రీకాళహస్తీశా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 25: హాలాహలం తాగిన శివుడు మగత నిద్రలోకి జారుకొని తిరిగి మేల్కోనే ఉత్సవమే లింగోద్భవం. మహాశివరాత్రి తరువాత ఆలయంలో వైభవంగా సంప్రదాయ రీతిలో ఈ ఉత్సవం జరగడం ఆనవాయితీ. అయితే ఇఓ ఏకపక్ష నిర్ణయాలతో ఉత్సవం మొత్తం రసాభాసగా మారింది. ఇఓకు, ట్రస్టుబోర్డుకు ఉన్న బేధాభిప్రాయాలు మరోసారి బయటపడ్డాయి. ఒకరిపై ఒకరు బహిరంగంగానే ఆరోపణలు చేసుకున్నారు. శివరాత్రి సందర్భంగా నంది, సింహ వాహనాలపై ఊరేగిన స్వామి, అమ్మవార్లు ఆలయానికి వచ్చిన తరువాత తలుపులు మూసివేసి శుద్ధిచేసి గోపూజ నిర్వహించి 11వ అభిషేకాన్ని లింగోద్భవ అభిషేకంగా నిర్వహిస్తే అదిచూసి తరించడానికి భక్తులు బారులు తీరేవారు. అయితే ఉత్సవమూర్తులు ఆలయంలోకి రాకముందే అర్థరాత్రి తరువాత ఒంటి గంటలకు ఇఓ భ్రమారాంబ స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేసుకున్నారు. ఈ విషయం తెలుసకున్న పెద్దలు ఇఓను గట్టిగా నిలదీశారు. ఆ విధంగా చేయవద్దని అర్చకుల ద్వారా ఇఓకు నచ్చచెప్పే ప్రయత్నాలు చేశారు. అయితే బోర్డు సభ్యుడు బాలాజి తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. ఉత్సవమూర్తులు ఆలయంలోకి రాకముందే ట్రస్టుబోర్డు సభ్యులు లేకనే లింగోద్భవ అభిషేకం చేయడం ఏమిటని ప్రశ్నించారు. అంతేకాకుండా మహాలఘు దర్శనం పేరుతో సుమారు 35 అడుగుల దూరం నుంచి స్వామి వారి దర్శనానికి ఏర్పాటుచేశారు. 10 అడుగుల దూరంనుంచే దర్శనానికి పంపితే స్వామి కనబడలేదంటూ భక్తులు గగ్గోలు పెడతారు. అటువంటిది 35 అడుగుల దూరం నుంచి మహాలఘుదర్శనం పేరుతో ఏర్పాటు చేయడంతో స్వామివారు కనిపించకుండా భక్తులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు, ట్రస్టుబోర్డు కలిసి నాటకాలు ఆడుతున్నారని, మహా లఘుదర్శనం పేరుతో భక్తులను ఇబ్బందులకు గురిచేయడం తగదని ఆవేశంతో అన్నారు. అంతేకాకుండా లింగోద్భవం అభిషేకానికి వచ్చిన బోర్డు సభ్యులు కొందరు ముందుగా చేరుకోగా మరికొందరు క్యూలైన్‌లలో చిక్కుకున్నారు. తాము లోపలికి రావడానికి తాళాలు తీయాలని ఇ ఓకు చెప్పిపంపినా ప్రయోజనం లేకపోయింది. దీంతో బోర్డు సభ్యుడు నారాయణయాదవ్ ఇ ఓ వైఖరిపై మండిపడ్డారు. తమ బంధువులను కూడా క్యూలైన్‌లో పంపి అవమానించారని చైర్మన్ గురవయ్యనాయుడు ఇ ఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో లింగోద్భవం ఆద్యంతం రసాభాసగామారింది. భక్తుల మధ్య తోపులాటలు కూడా జరిగాయి. మహాశివరాత్రి రోజు మహా లఘు దర్శనాన్ని అడ్డుకున్నామని, లింగోద్భవానికి అమలుచేశారని బోర్డుసభ్యులు బాలాజి ఆగ్రహం వ్యక్తం చేశారు.