ఆంధ్రప్రదేశ్‌

ఐదుగురు ‘గోవాడ’ ఉద్యోగుల సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, ఫిబ్రవరి 25: హుదూద్ తుపాను నేపథ్యంలో తడిచిన పంచదార అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడిన విశాఖ జిల్లా గోవాడ సుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులను శనివారం కర్మాగారం ఎండి విక్టర్ రాజు సస్పెండ్ చేసారు. రాష్ట్ర సుగర్ కేన్ కమిషనర్ ఎల్. మురళీ ఈనెల 17న ఆర్‌సి నెంబర్ 2535-2015 బి 3 పేరిట జారీ చేసిన ఆదేశాల మేరకు అవకతవకలకు పాల్పడిన ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు శనివారం వెల్లడించారు. 2014 అక్టోబర్‌లో సంభవించిన హుదూద్ తుపాను ప్రభావానికి గోదాముల పైకప్పులు ఎగిరిపోయి లక్షా 20వేల పంచదార బస్తాలు తడిసిపోయాయి. ఈ సందర్భంగా చేపట్టిన విచారణలో పంచదార బస్తాల అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో సుగర్ కేన్ కమిషనర్ ఈ ఆదేశాలు జారీచేసారు. అప్పటి ఫ్యాక్టరీ ఎండి వివి రమణారావు, ఆఫీస్ మేనేజర్ వర్మ, ఇన్‌చార్జి చీఫ్ అకౌంటెంట్ ఆఫీసర్ మురళి, పంచదార గోదాము గుమస్తాలు బి. రవిప్రసాద్, ఎ. మురళీకృష్ణ నిబంధనలు అతిక్రమించి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారిని సస్పెండ్ చేసారు. అవకాశాన్ని బట్టి వీరిపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామన్నారు.