ఆంధ్రప్రదేశ్‌

గిల్ ట రాజధానీ నిర్మించలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 25: ఎపి సిఎం చంద్రబాబు నాయుడు బంగారు రాజధాని కాదు కదా.. రోల్డ్ గోల్డ్ రాజధాని కూడా నిర్మించలేరని, కాగితాలకు, ప్రచారానికే పరిమితం అని యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అబ్రహం రాయ్‌మణి, కార్యదర్శి వి వరప్రసాద్ ఎద్దేవా చేశారు. దళితుల ఆత్మగౌరవం కించపర్చే విధంగా టిడిపి పాలన సాగుతోందని, చంద్రబాబు దళిత వ్యతిరేకి అని ఆరోపించారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం రాయ్‌మణి అధ్యక్షతన యువజన కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిడిపి పాలన పారదర్శకం అని ప్రచారం చేసుకోవడం తప్ప ఆ దిశగా పాలన లేదన్నారు. 2014 ఎన్నికల సందర్భంగా యువతకు చంద్రబాబు ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు. ఇంటికి ఒక ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి అని ఇచ్చిన హామీ గాలికి వదిలేశారు. హామీల అమలు సాధనకు అన్ని జిల్లా కేంద్రాల్లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన, నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఏపికి ప్రత్యేక హోదా, 2014 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చారా లేదా అనే రెండు అంశాలపై రాష్టవ్య్రాప్తంగా యువజన బ్యాలెట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెద్ద నోట్లు రద్దు కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ప్రజాదర్బార్ అన్ని నియోజకవర్గ స్థాయిల్లో నిర్వహిస్తామన్నారు. స్థానిక సంస్థలపై యువత సహకారంతో పోరాటానికి ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. యువతను కాంగ్రెస్ పార్టీలోకి పెద్దఎత్తున ఆహ్వానిస్తున్నామని, అందులో భాగంగా రాజీవ్ యువ సమీకరణ అనే కార్యక్రమం రూపొందించినట్లు తెలిపారు. యువజన కాంగ్రెస్ లక్ష్యం అధికారం కాదని, ప్రజల సమస్యలే యూత్ కాంగ్రెస్ ఎజెండాగా పోరాడుతుందన్నారు. ఈ సమావేశంలో 13 జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులతో పాటు ఎపి యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు మదన మోహన్, కంద అమర్‌నాధ్, సీతారామ్, సుజాత, విజయ్, ఫిరోజ్‌తో పాటుగా బొండా వెంకట్ (తూర్పుగోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు) రాజీవ్ విమల్ (ప్రకాశం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు), సుబ్బారావు (పశ్చిమ గోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు), తదితరులు పాల్గొన్నారు.