ఆంధ్రప్రదేశ్‌

ట్రంప్ కంపు చేస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 25: అమెరికాలో భారతీయులపై జరుగుతున్న వరుస దాడుల ఘటనలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు డిమాండ్ చేశారు. ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు భారతీయులపై దాడులు, హత్యలకు దారితీస్తున్నా ప్రభుత్వాలు సరైన రీతిలో స్పందించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంఘటనలపై చర్చించేందుకు పార్లమెంట్ సమావేశాలను ప్రత్యేకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడలో శనివారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ట్రంప్ అనుసరిస్తున్న జాతి విద్వేషాన్ని రెచ్చగొట్టే చర్యల వల్ల ఆ దేశానికి వలస వచ్చిన వారిపై దాడి సంఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మత, జాతి విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. దీని పర్యవసానమే ప్రస్తుతం భారతీయులపై జరుగుతున్న దాడులని చెప్పారు. ఒకప్పుడు వారి అవసరాలకు గ్లోబలైజేషన్‌ను ప్రోత్సహించిన అమెరికా ఇప్పుడు వారి అవసరాలు తీరిపోయిన అనంతరం గ్లోబలైజేషన్‌కు వ్యతిరేకంగా అక్కడున్న వారిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అమెరికాలో వర్ధమాన దేశాలకు చెందిన వారు 1.50 కోట్ల మంది ఉన్నారని, వారిలో భారతీయులు 50 లక్షల మంది ఉన్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 700 ఇంజనీరింగ్ కళాశాలల్లో కోర్సులు పూర్తి చేసిన వేలాది మంది అమెరికాలో ఉద్యోగాలకు వెళ్ళేందుకు సిద్ధమవుతుండగా ట్రంప్ నిర్ణయంతో వీరంతా ఆందోళన చెందుతున్నారని చెప్పారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు పాల్గొన్నారు.

చిత్రం..ట్రంప్ దిష్టిబొమ్మతో ధర్నా చేస్తున్న సిపిఎం శ్రేణులు