ఆంధ్రప్రదేశ్‌

నువ్వా... నేనా...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 25: కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రతిష్ఠకు సవాలుగా మారింది. ఈ ఫలితంతో జగన్‌కు స్థానికంగానే బలం లేదని చాటేందుకు తెదేపా నేతలు, బాబాయ్‌ను గెలిపించుకుని జిల్లాలో తెదేపాకు స్థానం లేదని చాటేందుకు జగన్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీలు డబ్బును మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేస్తూ, క్యాంపు రాజకీయాలకు తెరలేపడంతో కడప ఎన్నిక ఉత్కంఠభరితంగా మారింది.
రాష్ట్రంలో మార్చి 17న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలన్నీ ఒక ఎత్తయితే, కడప జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎన్నిక మరొక ఎత్తుగా కనిపిస్తోంది. మాజీ ఎంపి, దివంగత సిఎం వైఎస్ సోదరుడైన వివేకానందరెడ్డి వైసీపీ అభ్యర్ధిగా తెరపైకి రావడంతో పోరు ఆసక్తికరంగా మారింది. పార్టీ అధినేత జగన్ ఈ ఎన్నికను ప్రతిష్ఠగా తీసుకుని, దానిపైనే దృష్టి సారించారు. ఇప్పటివరకూ ఎన్నికలకు పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టని జగన్, ఈసారి తన స్వభావానికి విరుద్ధంగా సొంత డబ్బు ఖర్చుపెడుతున్నారంటే ఈ ఫలితాన్ని ఆయన ఏ స్థాయిలో ప్రతిష్ఠగా తీసుకున్నారో స్పష్టమవుతోంది. ఎప్పుడూ జనం తనను చూసే ఓట్లేస్తారు కాబట్టి, మిగిలిన వారిలా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టవద్దని చెప్పే జగన్, ఈసారి మాత్రం పార్టీ నేతలపై ఆర్థిక భారం వేయకుండా తానే సొంతంగా ఖర్చు చేస్తుండటం ఈ ఎన్నికల్లో మరో విశేషం.
అటు తెలుగుదేశం పార్టీ కూడా డబ్బు ఖర్చు విషయంలో ఎక్కడా వెనుకంజవేయడం లేదు. వైసీపీ కంటే ఎక్కువగానే ఖర్చు చేస్తోంది. అభ్యర్థి రవీంద్రనాధ్‌రెడ్డిని తెరమీదకు తెచ్చిన ఎంపి సిఎం రమేష్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆయన విజయం కోసం పనిచేస్తున్నారు. అయితే అభ్యర్థిపై జిల్లా నేతల్లో ఇప్పటికీ అసంతృప్తి తగ్గకపోవడం, సొంత పార్టీ నేతల్లోనే సహాయ నిరాకరణ కనిపిస్తుండటంతో ఆందోళన చెందిన నాయకత్వం, సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని రంగంలోకి దింపింది. దానితో ఆయన వైరి వర్గాలతో చర్చించి గెలుపు కోసం శ్రమించాల్సి వస్తోంది.
అయితే కొందరు సీనియర్లు అభ్యర్థిపై వ్యతిరేకత కారణంగా చురుకుగా వ్యవహరించడం లేదన్న ఫిర్యాదులు రాష్ట్ర కార్యాలయానికి వస్తున్నాయి. సీనియర్ నేత నరసింహారెడ్డికి సీటు ఇచ్చి ఉంటే పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉండేదని, అలాకాకుండా బలహీనమైన అభ్యర్థిని తెరమీదకు తెచ్చినందువల్ల ఎవరూ సహకరించడం లేదన్న సమాచారం ఉంది. ఈ క్రమంలోనే కొందరు సీనియర్లు వౌనంగా ఉండగా, మరికొందరు పైకి నామమాత్రంగానే ప్రచారం చేస్తున్నట్లు ఫిర్యాదులొచ్చాయి.
కాగా, వివేదానందరెడ్డి పార్టీ ఏదైనా వ్యక్తిగతంగా మంచివాడని, పైగా వైఎస్ సతీమణి విజయలక్ష్మి ఓడినందున, జిల్లాలో ఆయన తమ్ముడయిన వివేకాను గెలిపించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందనే వ్యక్తిగత కోణం అటు తెదేపా స్థానిక ప్రజాప్రతినిధుల్లోనూ కనిపిస్తోందని టిడిపి సీనియర్ నేత ఒకరు వెల్లడించారు.
ఇదిలాఉండగా, తెదేపా ఫిరాయింపుదార్లపైనే ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు, వివిధ కారణాలతో ఫిరాయించిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల సంఖ్యను చూసి ధీమాతో ఉన్నప్పటికీ.. ఎన్నికల సమయానికి వారంతా వివేకానందరెడ్డిపై ఉన్న వ్యక్తిగత అభిమానం, ‘జిల్లా అభిమానం కోణం’లో క్యాంపులో ఉన్న వైసీపీ ప్రతినిధులు ఆఖరి నిమిషంలో ఆ పార్టీకి జైకొడతారన్న అనుమానం కూడా తెదేపా నేతల్లో లేకపోలేదు. కొద్దినెలల క్రితం వైసీపీ నుంచి తెదేపాలో చేరిన కడప కార్పొరేటర్లు, మరికొందరు ప్రజాప్రతినిధులు ఇటీవలే తిరిగి వైసీపీలో చేరడం షాక్‌నిచ్చింది. పైగా సీనియర్ నేత డీఎల్ వర్గం కూడా వైసీపీకే మద్దతు ఇస్తుండటం, గతంలో ఒక వెలుగువెలిగి ప్రస్తుతం వౌనంగా ఉన్న పాత సీనియర్లు కూడా వివేకాపై ఉన్న వ్యక్తిగత అభిమానం, వ్యక్తిత్వంపై గౌరవంతో ఆయనకు సహకరిస్తుండటం కూడా తెదేపాకు ఇబ్బందిగా మారింది. ఇప్పటి సమాచారం ప్రకారం తెదేపా కంటే వైసీపీకే సుమారు 200 ఓట్లు అధికంగా ఉన్నాయి. మిగిలిన 80 అటు ఇటయినా వివేకా 200 ఓట్లతో గెలుస్తారన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
ఈ ఎన్నికల్లో గెలిస్తే ఇక కడపలో పార్టీకి తిరుగు ఉండదన్న లక్ష్యంతో తెదేపా పట్టుదలతో పనిచేస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేష్ తరచూ జిల్లా నేతలతో చర్చిస్తున్నారు. లోకేష్ కడప ఎన్నికపైనే సీరియస్‌గా దృష్టి సారించారు. ఈ ఎన్నికలో విజయం సాధించకపోతే కడపలో వైసీపీని ఓడించడం కష్టమన్న సంకేతాలు వెళ్లటం ఖాయం. అటు జగన్ కూడా ఈ ఎన్నికల్లో బాబాయ్‌ను గెలిపించుకోకపోతే సొంత జిల్లాలోనే పార్టీని గెలిపించుకోలేని జగన్, ఇక రాష్ట్రంలో పార్టీని ఏం గెలిపిస్తారన్న విమర్శను ఎదుర్కోవలసి ఉంటుంది.

చిత్రం.. చంద్రబాబునాయుడు, జగన్మోహన్‌రెడ్డి