ఆంధ్రప్రదేశ్‌

తక్షణం నివారణ చర్యలు చేపట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 25: రాష్ట్రంలో కరవు నివారణకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఏపిసిసి అధ్యక్షుడు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కరవు పీడిత ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు అందించినట్లు తెలిపారు. శ్రీకాకుళంలో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, డిసిసి అధ్యక్షుడు డొల్ల జగ్నధాం ఆధ్వర్యంలో జెసి రజనీకాంత్‌రావుకు వినతి అందించారని చెప్పారు. విశాఖపట్నంలో డిసిసి అధ్యక్షుడు పి బాలరాజు, విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహార భాస్కర్, దోణ్రంరాజు శ్రీనివాసు, సతీష వర్మ తదితరులు కలిసి డిఆర్వోకు, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కమిషనర్‌కు నగర అధ్యక్షుడు మోహన్ ఆధ్వర్యంలో, కృష్ణాజిల్లాలో మచిలీపట్నం నగర అధ్యక్షుడు మతిన్ తదితరురు, గుంటూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ, డిసిసి అధ్యక్షుడు మక్కెన మల్లిఖార్జున్, నగర అధ్యక్షుడు ముత్యాలరావు, మహిళా నాయకులు, ప్రకాశం జిల్లాలో డిసిసి అధ్యక్షుడు సుధాకర్, ఏపిసిసి నాయకులు యాదవ్ రాజశేఖర్, ఎస్సీ సెల్ నాయకులు రాజగోపాల్ తదితరులు వినతిపత్రం అందించారన్నారు.