ఆంధ్రప్రదేశ్‌

రూ.800కోట్లకు చేరుకోనున్న అన్నప్రసాద విరాళాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 25:టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నప్రసాదం ట్రస్టుకు 2016-17 ఆర్థిక సంవత్సరం మార్చి నెలాఖరు నాటికి భక్తులు అందించిన విరాళాలు రూ.800 కోట్లకు చేరుకోనున్నాయని టిటిడి ఇ ఓ డాక్టర్ డి.సాంబశివరావు వెల్లడించారు. స్థానిక టిటిడి పరిపాలనా భవనంలో శనివారం అన్నప్రసాదం ట్రస్టు కార్యకలాపాలపై సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలకు విచ్చేస్తున్న లక్షలాది మంది భక్తులు రోజంతా వేడివేడిగా అన్నప్రసాదాలు, అల్పాహారం మరింత రుచిగా,శుచిగా అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. వంటల తయారీకి, శుభ్రం చేసేందుకు ఆధునిక యంత్రాలను వినియోగించాలని ఆదేశించారు. అన్నప్రసాదాల తయారీకి డీజిల్ వినియోగాన్ని తగ్గించి గ్యాస్ వినియోగాన్ని పెంచాల్సి ఉందని, దీనిని పర్యవేక్షించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. అన్నప్రసాదాల తయారీలో నాణ్యత పెంచడంతోపాటుగా వృథాను తగ్గించాలని, బియ్యం వండేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాగా తిరుమలకు వచ్చే భక్తులు తమ పెళ్లిరోజు, పుట్టినరోజున, ఇతర శుభ సందర్భాల్లో అన్నప్రసాదానికి అయ్యే ఖర్చును, లేదా బియ్యం ఖర్చు చెల్లించడానికి వీలుగా బియ్యానికి అయే ఖర్చును నగదు రూపంలో చెల్లించే అవకాశాన్ని భక్తులకు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఒక భోజనం ఖర్చు రూ.25 చొప్పున వెయ్యిమందికి రూ. 25వేలు ఖర్చు అవుతుందన్నారు. వెయ్యిమందికి తగ్గకుండా ఎంతమందికైనా అన్నప్రసాద వితరణకు భక్తులు విరాళం అందించవచ్చన్నారు. తిరుమలలో అన్నప్రసాదం, అల్పాహారం కలిపి ఒక రోజుకు లక్ష మందికి వడ్డిస్తున్నామని , ఈ మేరకు ఒక రోజంతా తమ పేరుమీద భక్తులకు అన్నప్రసాదదాలు అందించాలంటే రూ. 25 లక్షలు విరాళంగా అందించాలి. భక్తులు నుంచి బియ్యం విరాళాలను నగదు రూపంలో స్వీకరిస్తామని, బియ్యం కిలో ధర రూ.40కాగా, టన్ను బియ్యం ధర రూ.40వేలు అవుతుందన్నారు. ఈలెక్కన ఎన్నికటన్నులకైనా సొమ్మును విరాళంగా దాతలు అందించవచ్చని తెలిపారు. విరాళాలను డిడిలు, చెక్కుల రూపంలో, ఈ డొనేషన్ ద్వారా భక్తులు అందించవచ్చని , అన్నప్రసాదం ట్రస్టు నిబంధనల మేరకు ఆదాయపు పన్ను మినహాయింపుతోపాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు.