ఆంధ్రప్రదేశ్‌

భక్తులకు కనువిందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కాళహస్తి, ఫిబ్రవరి 25: వాయులింగేశ్వరుని రథోత్సవం భక్తుల్లో ఉత్సాహం నింపింది. ఆనందోత్సాహాల మధ్య రథోత్సవం వేడుకగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం బ్రహ్మరాత్రిని పురస్కరించుకొని బ్రహ్మరథంలో గంగాదేవి సమేతుడైన సోమస్కందమూర్తి ఆశీనుడయ్యాడు. మరోరథంలో జ్ఞాన ప్రసూనాంబ ఊరేగుతూ భక్తులకు కనువిందుచేసింది. లింగోద్భవం తరువాత బ్రహ్మ నిర్వహించిన ఉత్సవం కావడంతో దీనిని బ్రహ్మరాత్రి అంటారు. ఈ సందర్భంగా ఉదయం ఉత్సవ మూర్తులను పూలతో, దివ్యాభరణాలతో అలంకరించి రథంపై ఏర్పాట్లుచేసి ఉత్సవం నిర్వహించారు. హరహరమహాదేవ శంభోశంకరా అంటూ స్వామివారి రథాన్ని, జైకాళీ, జైజై భద్రకాళీ అంటూ అమ్మవారి రథాన్ని భక్తులు తన్మయత్వంతో లాగారు. స్వామి, అమ్మవార్ల రథాన్ని లాగడానికి భక్తులు పోటీలు పడ్డారు. ఉదయం 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 2.15 గంటల వరకు 3 గంటల పాటు రథోత్సవం జరిగింది. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. పట్టణంలోని నాలుగు ప్రధాన వీధులూ భక్తులతో నిండిపోయాయి. ఎండ వేడి ఉన్నప్పటికీ భక్తులు లెక్కచేయకుండా ఉత్సవంలో పాల్గొన్నారు. మొక్కుబడి ఉన్న భక్తులు రథాలపై ఉప్పు, మిరియాలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టుబోర్డు చైర్మన్ గురవయ్యనాయుడు, బోర్డు సభ్యులు, శాప్ చైర్మన్ పి ఆర్ మోహన్, మాజీ చైర్మన్ కోలా ఆనంద్, వైసిపి నాయకుడు మధుసూధన్‌రెడ్డి, ఇ ఓ భ్రమరాంబ తదితరులు పాల్గొన్నారు. డి ఎస్పీ వెంకటకిశోర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.