కృష్ణ

ఫొటొ బొండ ఉమలో ఉంది ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 25: అమెరికా జాత్యహంకార హత్యలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితిలో అమెరికాపై ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దని, పరిస్థితులు చక్కబడే వరకూ కొనే్నళ్లపాటు అమెరికా ప్రయాణం చేయవద్దని ఎమ్మెల్యే బొండా ఉమమహేశ్వరరావు అన్నారు. అమెరికాలో హత్యకు గురైన కూచిభొట్ల శ్రీనివాస్ ఉదంతాన్ని ఖండిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చర్యలకు నిరసనగా శనివారం ఉదయం మధురానగర్‌లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ మాట్లాడుతూ అమెరికాలో జరుగుతున్న హత్యలను చూసి ప్రపంచం మొత్తం నివ్వెరపోతోందని, అమెరికాలో విద్యా, ఉద్యోగం కన్నా ప్రాణాలే మిన్న కాబట్టి వాస్తవ పరిస్థితిలు నెలకొనే వరకూ అమెరికా వైపు చూడవద్దని హితవు పలికారు. అలాగే అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న చర్యలు కూడా శోచనీయమని, ప్రపంచం మొత్తం నిరసిస్తున్నా ఆయన చర్యలు మానుకోకపోవడం గర్హనీయమన్నారు. కోట్లాది మంది ప్రవాస భారతీయుల సమస్యను పరిష్కరించడంలో భారత ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. అమెరికన్ చేతిలో హత్యకు గురైన కూచిభొట్ల శ్రీనివాస్‌కు ఘనంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ఉమ ట్రంప్ చర్యలను తీవ్రంగా నిరసించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మానవ హారంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేషధారణతో కూడిన వ్యక్తిని ప్రదర్శించడం అందరినీ అకట్టుకుంది.

రూ.వెయ్యి చెల్లిస్తే తక్షణం యుజిడి కనెక్షన్
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 25: నగర పరిధిలోని అండర్ గ్రౌండ్ కనెక్షన్లను తీసుకొనే వారికి శుభవార్త. యుజిడి కనెక్షన్ కోసం చెల్లించాల్సిన డిపాజిట్ నగదు మొత్తాన్ని ఒకేసారి కాకుండా వాయిదా పద్ధతిలో చెల్లించే ప్రక్రియకు విఎంసి శ్రీకారం చుట్టింది. నగరంలో నూరు శాతం యుజిడి కనెక్షన్లను ఇచ్చి నూరు శాతం యుజిడి నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో విఎంసి కమిషనర్ వీరపాండియన్ వాయిదా పద్ధతిని ప్రవేశపెట్టారు. తొలి చెల్లింపుగా రూ.1000లను చెల్లిస్తే తక్షణం యుజిడి కనెక్షన్ ఇస్తారు. మిగిలిన డిపాజిట్ నగదు వాయిదాలలో చెల్లించవచ్చని, ఈఅవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇళ్లలోని వాడుక నీరు సైడ్ కాల్వల్లోకి పారదల చేయడం వలన ఉత్పన్నమవుతున్న దోమల వృద్ధితోపాటు ప్రజారోగ్య సమస్యలను పరిష్కరించేందుకు గాను ఈచర్యలు తీసుకొంటున్నామన్నారు. ప్రస్తుతం నగరం మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం అందుబాటులో ఉందని, అన్ని ప్రాంతాల్లోనూ సూయజ్ ట్రీట్‌మెంట్‌ప్లాంట్లు (ఎస్‌టిపి) నిర్మాణాలు పూర్తవడంతో యుజిడి సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. భవిష్యత్తులో కేవలం వర్షం నీరు మాత్రమే సైడ్ కాల్వల్లో ప్రవహించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. గృహాల వాడుక నీటితోపాటు టాయిలెట్ల అవుట్‌లెట్లు కూడా యుజిడికి కనెక్ట్ చేస్తున్నట్టు కమిషనర్ తెలిపారు. రూ.1000ల చెల్లింపుతో మంజూరు చేస్తున్న యుజిడి కనెక్షన్ల దరఖాస్తుల కోసం ప్రతి డివిజన్‌లోనూ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు.