కృష్ణ

జాత్యాహంకారంతోనే శ్రీనివాస్ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: అమెరికాలో జాత్యాహంకారంతో అన్యాయంగా కూచిబొట్ల శ్రీనివాస్‌ను హత్య చేశారని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య, విజయవాడ బ్రాహ్మణ సేవా సంఘం, ఇతర సంఘాల నేతలు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. కూచిబొట్ల శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అమెరికాలో ఉన్న వలసదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న అధ్యక్షుడు ట్రంప్ విధానాలను మార్చుకోవాలన్నారు. అమెరికాలోని వలసదారులకు రక్షణ కల్పించాలని బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు కొప్పరపు వెంకట బలరామకృష్ణమూర్తి కోరారు. ఈవిషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి అమెరికా అధ్యక్షుడితో సంప్రదింపులు జరిపి అక్కడి భారతీయులకు అండగా నిలవాలన్నారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని బలరామకృష్ణమూర్తి, సహాయ ప్రధాన కార్యదర్శి శిరిపురపు శ్రీ్ధర్, రాష్ట్ర నేత దమ్మాలపాటి చంద్రశేఖర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కళాకిరీటి ప్రభల శ్రీనివాస్, నారుమంచి నారాయణ, ఎంఎస్ నారాయణరావు, పైడిపాటి వెంకన్న, కె కామేశ్వరరావు, ధూపాటి శ్రీదేవి కూడా మరో ప్రకటనలో శ్రీనివాస్ హత్యను తీవ్రంగా ఖండించారు.

ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్‌లో
పట్టుబడిన 60మంది విద్యార్థులు
విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 25: నగరంలో ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తున్న విద్యార్థులు పట్టుబడుతూనే ఉన్నారు. నగరంలోని కళాశాలలు, విద్యాసంస్థల వద్ద ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించి డ్రైవింగ్ చేస్తూ పలువురు విద్యార్థులు పట్టుబడుతున్నారు. ఈక్రమంలో నగరంలోని చైత న్య జూనియర్ కళాశాల, నలంద కళాశాల, శారదా కళాశాల, పివి సిద్ధార్థ కళాశాల, ధనేకుల ఇంజనీరింగ్, గురుకులాస్, కెబిఎన్ కళాశాల తదితర విద్యాసంస్థల వద్ద శనివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న, ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తున్న 60మంది విద్యార్థులు పట్టుబడ్డారు. వీరందరిని బందరురోడ్డులోని కెఎస్ వ్యాస్ కాంప్లెక్స్‌కు తరలించి వారి తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో పిల్లలకు ట్రాఫిక్ అదనపు డిసిపి టి నాగరాజు కౌనె్సలింగ్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తరచూ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వారిపై ఆధార్ నెంబర్ ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి వాహనదారుడు విధిగా డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, హెల్మెట్ ధరించి వాహనం నడపాలని సూచించారు. ట్రిబుల్ రైడింగ్, అతి వేగం పనికిరాదన్నారు. నగరంలో సగటున రోజుకు రోడ్డు ప్రమాదాల్లో ఒకరు చనిపోతున్నారని, వీరిలో ద్విచక్ర వాహనాలు నడిపేవారు ఎక్కువగా ఉన్నారని వివరించారు. సెక్షన్ 181 మోటారు వాహనాల చట్టం 1988, డ్రైవింగ్ లెసెన్స్ లేకుండా వాహ నం నడిపితే రూ.500ల జరిమానా లే దా 3నెలలు జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు. మైనర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి వాహనం ఇస్తే సెక్షన్ 189 కింద వాహన యజమానికి రూ. 1000లు జరిమానా లేదా 3నెలల జైలుశిక్ష విధించడం జరుగుతుందన్నారు. పిల్లలు లైసెన్స్ లేకుండా వాహనం నడపడం నేరం, ప్రమాదం అని వారి తల్లిదండ్రులకు సూచించారు. నగరంలో ప్రతిరోజూ కళాశాలల వద్ద వాహన తనిఖీలు ఉంటాయని, తనిఖీ సమయాల్లో పోలీసులు ఆపినప్పుడు ఆగకుండా అతివేగంతో తప్పించుకునేందుకు ప్రయత్నించి ప్రమాదాల బారిన పడరాదని, బైక్ ఆపి పోలీసులకు సహకరించాలని సూచించారు. కౌనె్సలింగ్‌లో ట్రాఫిక్ ఏసిపి ఎం వెంకటేశ్వర్లు, సిఐ వి సుబ్బరాజు పాల్గొన్నారు.