ఆంధ్రప్రదేశ్‌

దేశానికి హిందూ ధర్మమే ప్రత్యామ్నాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 26: కేపిటలిజం, కమ్యూనిజం కంటే ఈ దేశానికి హిందూయిజమే ప్రత్యామ్నాయమని రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్‌ఎస్‌ఎస్) ఆంధ్ర ప్రాంత ప్రచారక్ భరత్‌కుమార్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సిజిటిఎం కళాశాల ప్రాంగణంలో ఆదివారం జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సాంఘిక్ సమావేశంలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ఈ దేశ వైభవ స్థితి సాధనే ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యమన్నారు. ప్రపంచంలోని కేపిటలిజం, కమ్యూనిజానికి భారతీయ ఆలోచన విధానమే ప్రత్యామ్నాయమన్నారు. ప్రపంచానికి సుఖమైన జీవనాన్ని ఇవ్వగలిగిందే హిందూయిజమన్నారు. ఇరవై ఏళ్ల క్రితం కమ్యూనిజం సరికాదని రష్యా చెప్పినా ఇంకా అర్ధంకాక పట్టుకుని వేళ్లాడుతున్నారని విమర్శించారు. ప్రపంచంలోని అందరూ సుఖంగా వుండాలని కోరుకునేదే హిందూ ధర్మన్నారు. కేరళలో ఆర్‌ఎస్‌ఎస్ వైపు వెళ్తున్నారని చెప్పి కమ్యూనిస్టులు 11 మందిని కాల్చి చంపారని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ఘటనకు నిరసనగా మార్చి ఒకటో తేదీన జిల్లాలో ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు.
కమ్యూనిజం విజయ రహస్యం ద్వేషమని, ఆర్‌ఎస్‌ఎస్ విజయ రహస్యం ప్రేమ, ఆత్మీయత, అనురాగమని విశే్లషించారు. సంస్కృతి, ధర్మాన్ని ఆచరిస్తూ దేశానికి వైభవాన్ని తీసుకురావడమే ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యమన్నారు. సిద్ధాంతం మంచిదైనా ఆచరించే సమాజం వుంటేనే ప్రపంచం మనల్ని అనుకరిస్తుందన్నారు. ఇతరుల నమ్మకాన్ని గౌరవించి కలసి జీవించినపుడే ప్రపంచం సుఖంగా వుంటుందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుందన్నారు. వ్యవస్థను నిర్వహించే వ్యక్తిలో మార్పుకోసం, కఠోర దీక్ష చేయడం ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాకులు డాక్టర్‌జీ సిద్ధాంతమన్నారు. డాక్టర్‌జీ జీవితాన్ని అధ్యయనం చేయాలన్నారు. ప్రతీ గ్రామంలోనూ ఆర్‌ఎస్‌ఎస్ శాఖలను ఏర్పాటు చేయాలన్నారు.