ఆంధ్రప్రదేశ్‌

బ్రాహ్మణుల సూచనలతోనే పాలన సాగేది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 26: అలనాటి రాజ్యాలు సుభిక్షంగా ఉన్నాయంటే, అందుకు కారణం ఆనాటి రాజులు బ్రాహ్మణుల సూచనలు, సలహాలను పాటించేవారని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి అన్నారు. కేరళలోని కాలడి గ్రామంలో ఆదివారం జరిగిన అఖిల భారత బ్రాహ్మణ సదస్సులో పాల్గొన్న మహాస్వామి అనుగ్రహ భాషణం చేస్తూ రాజ్యంలో కరవు, కాటకాలు సంభవించినప్పుడు బ్రాహ్మణుల సూచనల మేరకు యజ్ఞ, యాగాదులు నిర్వహించేవారని గుర్తుచేశారు. అందుకే ఆనాడు బ్రాహ్మణులకు అగ్రతాంబూలం లభించేదని అన్నారు. కానీ నేటి ప్రభువులు బ్రాహ్మణుల సలహాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు.
దేశంలోని అనేక రాష్ట్రాల్లో బ్రాహ్మణులను అణగదొక్కేందుకు కుటిల యత్నాలు జరుగుతున్నాయని స్వామి అన్నారు. రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ జాతిని గుర్తించి, వారి మేధా సంపత్తిని దేశానికి వినియోగించుకోవాలని స్వరూపానందేంద్ర సరస్వతి హితవుపలికారు. అర్చక, పరిచారిక వ్యవస్థల్లో బ్రాహ్మణులకు సముచిత స్థానం ఇవ్వకపోతే ప్రత్యక్ష పోరాటానికి దిగి, బ్రాహ్మణ జాతిని కాపాడుకుంటామని అన్నారు. వేదాలు, ధర్మాలు క్షుణ్ణంగా తెలుసుకుని దేవాలయాలను అభివృద్ధి చేస్తూ, తద్వారా సమాజ సుఖశాంతులకు పాటుపడుతున్న బ్రాహ్మణ జాతిని కుల ప్రాతిపదికన వచ్చిన రిజర్వేషన్ల పేరుతో అణచివేస్తున్నారని మహాస్వామి అన్నారు. గతంలో ఆదిశంకరాచార్యులు భారత దేశం అంతటా పర్యటించి అన్య మతస్తులను ఈ దేశం నుంచి పారదోలేందుకు కృషి చేశారని అన్నారు. అలాంటి సంప్రదాయ పీఠాధిపతిగా కొనసాగుతున్న తాను శంకరాచార్యుల జన్మస్థలమైన కాలడి నుంచి బ్రాహ్మణోద్ధరణకు శంఖారావాన్ని పూరిస్తున్నానని స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వెల్లడించారు. ఈ స్ఫూర్తితో బ్రాహ్మణ జాతి పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో శ్రీశంకరాచార్య, శ్రీరామానుజ, శ్రీమధ్వాచార్యుల సంప్రదాయ పీఠాలను, భక్తులను, బ్రాహ్మణ జాతి సభ్యులందరిని కలుపుకొని త్వరలోనే భారత దేశం మొత్తం పర్యటిస్తానని స్వరూపానందేంద్ర చెప్పారు.

చిత్రం.. బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులను సత్కరిస్తున్న స్వరూపానందేంద్ర సరస్వతి