కృష్ణ

అభివృద్ధి పనులకు నేడు సిఎం శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 13: భారత రాజ్యాంగ నిర్మాత స్వర్గీయ డా.బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బాబు ఎ సంబంధిత అధికారులను ఆదేశించారు. డా.బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాల ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ బాబు ఎ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గురువారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి గ్రామంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న గృహ నిర్మాణాల సముదాయానికి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. ఇందుకు సంబంధించి జక్కంపూడి వద్ద శంకుస్థాపన ఫైలాన్‌ను పనులను పూర్తిచేయాలని, ఫైలాన్ సమీపంలో జపాన్ బృందం రూపొందించిన గృహ నిర్మాణాల సముదాయాల నమూనా చిత్రాలను ప్రదర్శించేందుకు ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సమీప గ్రామాలకు చెందిన గృహాల లబ్ధిదారులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎంపిడిఓ, తహశీల్దార్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమగు షామియానాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారని తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లను చేపట్టాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించే కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, వివిధ దళిత సంఘాల నాయకులు, ప్రజలు హాజరు అవుతారని అవసరమయిన షామియానాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం ఎ.కనె్వన్షన్ సెంటరు నందు డా.బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయి ఎస్సీ లబ్ధిదారులకు ఉపకరణాలు పంపిణీ చేస్తారని, ఇందుకు అవసరమయిన ఏర్పాట్లను పూర్తిచేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఇడి సాంఘిక సంక్షేమ శాఖ డిడిలను జిల్లా కలెక్టర్ బాబు ఎ ఆదేశించారు. ఏర్పాట్ల పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ డా.జి.సృజన, డిసిపి కాళిదాసు, ముఖ్యమంత్రి చీఫ్ సెక్యూరిటీ అధికారి జోషి, హౌసింగ్ జిఎం శరత్‌బాబు, రూరల్ తహశీల్దారు మదనమోహన్ తదితరులు పాల్గొన్నారు.