ఆంధ్రప్రదేశ్‌

అవినీతిపరులను వెనకేసుకొస్తున్న బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 26: రాష్ట్ర మంత్రుల్లో చాలా మంది అవినీతికి పాల్పడుతున్నా, వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు వెనకేసుకువస్తున్నారని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఆదివారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. విశాఖలో ల్యాండ్ పూలింగ్ పేరుతో భారీ కుంభకోణం జరిగిందని, ఇందులో కొంతమంది మంత్రుల హస్తం ఉందని ఆరోపించారు. విశాఖ కేంద్రంగా గంజాయి స్మగ్లింగ్ జరుగుతోందని, దీంతో ఒక మంత్రికి సంబంధం ఉందని అన్నారు. అలాగే ఇద్దరు మంత్రులు మహిళలను వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారని అన్నారు. అయినప్పటికీ, వీరందరిని చంద్రబాబు తన మంత్రివర్గంలో ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదని, రాష్ట్ర క్యాబినెట్ రావణాసులతో నిండిపోయిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు మహిళల పట్ల గౌరవం లేదని రోజా విమర్శించారు. మహిళా పార్లమెంట్ సదసుకు తనను రానీయకుండా అడ్డుకోవడాన్నిబట్టి ప్రభుత్వానికి మహిళలపట్ల ఏపాటి గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్‌కు కూడా పలు కుంభకోణాలతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాలకు తాను హాజరవుతానని రోజా స్పష్టం చేశారు.
రోజా ఒక సూర్పణఖ: అనిత
రోజా తన పరిధి దాటి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే అనిత అన్నారు. ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రోజా మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. రోజా సూర్పణకలా మారారని, సూర్పణకకు ముక్కు, చెవులు కోస్తే, రోజాకు నాలుక కోసే పరిస్థితి వస్తుందని అనిత అన్నారు. వైకాపా నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని అన్నారు. జగన్ తాను కాబోయే ముఖ్యమంత్రినని చెప్పుకు తిరుగుతున్నారని, ఎమ్మెల్యేలు అధికారులను దూషిస్తున్నారని, రోజా నేరుగా డిజిపినే కామెంట్ చేస్తున్నారని వీరి చర్యలను ప్రజలు గమనిస్తున్నారని అనిత అన్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన శశికళ జైలుకు వెళ్లడంతో, జగన్ కూడా తానెప్పుడు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందోనన్న భయంతో ఇలాంటి చేష్టలకు దిగుతున్నారని అనిత అన్నారు. లోకేష్ గురించి మాట్లాడే అర్హత రోజాకు లేదని ఆమె అన్నారు.