ఆంధ్రప్రదేశ్‌

పరమ శివుని నంది విహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 26: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన స్కందరాత్రి సందర్భంగా ఆదివారం ఉదయం అధికార నంది వాహనంపై గంగాదేవి సమేతుడైన సోమస్కందమూర్తి ఊరేగారు. ఉదయం ఆలయంలో అభిషేకాలు పూర్తయిన తరువాత అలంకార మండపం నుంచి ఉత్సవమూర్తులను తీసుకెళ్లి ఊరేగించారు. గంగాదేవి సమేతుడైన సోమస్కందమూర్తి అధికార నంది వాహనంపై జ్ఞానప్రసూనాంబ కామధేనువు వాహనంపై భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మేళతాళాలతో జరిగిన ఊరేగింపులో భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.
కల్యాణోత్సవానికి ఏర్పాట్లు
స్కందరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆదిదంపతులు మరోసారి కల్యాణ తిలకం దిద్దుకున్నారు. ఏనుగు వాహనంపై గంగాదేవి సమేతుడైన సోమస్కందమూర్తి, సింహ వాహనంపై జ్ఞాన ప్రసూనాంబ ఆదివారం రాత్రి పట్టణంలోని పెండ్లి మండపం వద్దకు బయలుదేరారు. కల్యాణోత్సవం కోసం స్వామి శిష్యుడైన చండికేశ్వరుడు, పార్వతీదేవి తండ్రి పర్వతరాజుతో రాయబారం జరిపే ఘట్టం ఆసక్తికరంగా సాగింది. ఈ సందర్భంగా పెండ్లి మండపాన్ని పూలు, విద్యుద్దీపాలతో అలంకరించారు. స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం సందర్భంగా టిటిడి తరపున ఇఓ సాంబశివరావు ఆదివారం మధ్యాహ్నం శ్రీకాళహస్తికి వచ్చి పట్టువస్త్రాలను సమర్పించారు. సోమవారం తెల్లవారుజామున స్వామి అమ్మవార్లకు కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.

చిత్రం..నంది, కామధేను వాహనాలపై ఊరేగుతున్న గంగాదేవి సమేతుడైన సోమస్కందమూర్తి, జ్ఞానప్రసూనాంబ