ఆంధ్రప్రదేశ్‌

డబ్బు కోసం న్యాయవాద వృత్తిని వీడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్బవరం, ఫిబ్రవరి 26: డబ్బు సంపాదన కోసం న్యాయవాద వృత్తిని వీడొద్దని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టుప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ అన్నారు. విశాఖ జిల్లా, సబ్బవరంలోని దామోదర సంజీవయ్య నేషనల్ లా-యూనివర్శిటీలో రెండురోజుల పాటు మూట్‌కోర్టు పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రమేష్ రంగనాథన్ పాల్గొని, మాట్లాడారు. న్యాయశాస్త్రం చదువుకున్నప్పటికీ చాలామంది అత్యధిక మొత్తంలో డబ్బుసంపాదించాలనే ఆశతో పలు కంపెనీల్లో న్యాయ సలహాదారులుగా పనిచేసేందుకు మక్కువ చూపిస్తున్నారన్నారు. అయితే, న్యాయవాద వృత్తినే ఎన్నుకుని బార్ అసోసియేషన్‌లోపనిచేసినా లేక బెంచికోర్టుల్లో పనిచేసినప్పటికీ అయిదారేళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. అయితే, ఈ సమయంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు న్యాయాన్ని అందించి, సహాయం చేసిన వారవుతారన్నారు. అంతేకాకుండా కోర్టుల్లో పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి నోచుకుంటాయన్నారు. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటే కాలక్రమేణా మంచి న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా ఎదుగుతారని తెలిపారు. న్యాయాన్ని గెలిపించడంలో ఉన్న తృప్తి మరెందులోనూ లేదని పేర్కొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఇక్కడి న్యాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి వి.కేశవరావు మాట్లాడుతూ ఇక్కడ మూడోసారి మూట్ కోర్టు పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. కాంపిటేషన్స్ ఆఫ్ ఇండియా సభ్యుడు మనోజ్‌కుమార్ పాండే మాట్లాడుతూ తాను ఇక్కడి మూట్‌కోర్టుపోటీలను స్వయంగా తిలకించటం ద్వారా న్యాయ విద్యార్థుల ప్రతిభను గుర్తించానని ఫైనల్ పోటీలు ఎంతో రసవత్తరంగా సాగాయని పేర్కొన్నారు.