ఆంధ్రప్రదేశ్‌

మహదానందం మహానందీశ్వరుని రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానంది, ఫిబ్రవరి 26: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో శ్రీ కామేశ్వరీ మహానందీశ్వరుల స్వామివార్ల రథోత్సవం అశేష భక్తజనుల ఓంకార నామస్మరణ మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేదపండితులు రథశాల వద్ద గణపతి పూజ, పుణ్యాహవచనం, నవ కలశ స్నపనం, రథాంగ హోమం, పూర్ణాహుతి, రథాంగ బలి, పీఠార్చన, పీఠానికి అభిషేకం, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామిఅమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి మేళతాళాల మధ్య ఆలయం నుంచి రథశాలకు చేర్చి రథానికి కుంభబలి ఇచ్చారు. అనంతరం ఆలయ ఇఓ డా. శంకరవరప్రసాద్ కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు దాదాపు లక్ష మంది భక్తులు వచ్చి ఉంటారని అంచనా. దీంతో మహానంది క్షేత్రంలోని పురవీధులన్నీ కిటకిటలాడాయి. కాగా ఉదయం శ్రీ కామేశ్వరీ సమేత మహానందీశ్వర స్వామివార్లు అశ్వవాహనంపై విహహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.

చిత్రం..మహానందిలో అశేష భక్తజన సందోహం మధ్య రథోత్సవం