ఆంధ్రప్రదేశ్‌

కొత్త సిఎస్ అజయ్ కల్లం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 27: చీఫ్ సెక్రటరీ నియామకంపై జరుగుతున్న ఊహాగానాలకు ప్రభుత్వం సోమవారం తెరదించింది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న అజయ్ కల్లంను చీఫ్ సెక్రటరీగా ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకూ చీఫ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న ఎస్‌పి టక్కర్ రెండుసార్లు పదవీకాలం పొడిగింపు తరువాత మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. ఆ స్థానంలో సిఎస్‌గా కల్లంను నియమించారు. 1983 సంవత్సరం బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి కల్లం మార్చి 31న పదవీ విరమణ చేయనున్నారు. కల్లం తరువాత సిఎస్‌గా దినేష్ కుమార్‌ను కూడా నియమిస్తూ అదే ఉత్తర్వులో పేర్కొనడం విశేషం. టక్కర్‌కు రెండుసార్లు పదవీ కాలం పొడిగింపు తరువాత మరోసారి ఇచ్చేందుకు నిబంధనలు అనుమతించవు. దీంతో సిఎస్‌గా ఎవరిని నిమియమించాలన్న దానిపై భారీ కసరత్తు జరిగింది. అనేక మంది ఈ పదవి కోసం పోటీ పడినప్పటికీ, అజయ్ కల్లంపై ముఖ్యమంత్రి ఆసక్తి కనబరిచారు. కల్లాం మార్చి 31వరకు పదవిలో కొనసాగుతారు.
అనేక పదవులను అలకరించిన కల్లం
1983 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి కల్లం. వ్యవసాయ పట్ట్భద్రుడైన ఆయన ఢిల్లీలోని ఐఎఆర్‌ఐలో పీజీ (ప్లాంట్ బ్రీడింగ్ జెనటిక్స్)లో చేశారు. ఆస్ట్రేలియాలో ఎంబిఎ పూర్తి చేశారు. 1985-87 సంవత్సరాల మధ్య భువనగిరి, భద్రాచలం సబ్ కలెక్టర్‌గా వ్యవహరించారు. పాల్వంచ ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిగా, జంట నగరాల చీఫ్ రేషనింగ్ అధికారిగా, ఉద్యాన శాఖ డైరెక్టర్‌గా సేవలు అందచేశారు. 1991-95ల మధ్య పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఉద్యాన శాఖ డైరెక్టర్‌గా, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పిఎస్‌గా, వ్యవసాయ శాఖ కమిషనర్‌గా, ఎండోమెంట్, రెవెన్యూ శాఖలకు స్పెషల్ సెక్రటరీగా వ్యవహరించారు.
2002-05ల మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం ఇఒగా పనిచేసి భక్తుల సౌకర్యాల కల్పనకు కృషి చేశారు. ఎపి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండిగా, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా, ఎపి ట్రాన్స్‌కో సిఎండిగా కూడా సేవలు అందించారు. విశాఖపట్నం పోర్టు ట్రస్టు చైర్మన్‌గా, వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కూడా పని చేశారు.