రాష్ట్రీయం

ప్రజా ప్రయోజన వాజ్యాలపై స్టే ఇవ్వలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: విశాల ప్రజా ప్రయోజనాలను ఆశించే పిటిషన్లను మాత్రమే ప్రజా వ్యాజ్యాలుగా స్వీకరించాలనే ఉద్దేశంతో కొత్త నిబంధనలను ఖరారు చేసినట్లు హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. పిల్స్‌పై రూపొందించిన కొత్త మార్గదర్శకాలపై స్టే ఇవ్వాలని కోరుతూ కె శ్రావణ్‌కుమార్ దాఖలుచేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. పిల్‌ను దాఖలు చేయాలనుకునే వ్యక్తుల పూర్తి వివరాలను రిజిస్ట్రార్ కోరుతున్నారని, దీనివల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలకు లోబడి పిల్స్‌కు సంబంధించి కొత్త నిబంధనలు రూపొందించామని ధర్మాసనం పేర్కొంది.

డాక్టర్ శశికుమార్ కారు సీజ్

14 రౌండ్ల బుల్లెట్లు, సూట్ కేసు స్వాధీనం

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 11: నగరంలో సంచలనం సృష్టించిన డాక్టర్ల మధ్య కాల్పుల కేసులో డాక్టర్ శశికుమార్ కారును పోలీసులు గురువారం సీజ్ చేశారు. రెండ్రోజుల క్రితం మాదాపూర్‌లోని ప్రైవేటు లారెల్ ఆసుపత్రికి చెందిన ముగ్గురు భాగస్వాములైన డాక్టర్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకొని కాల్పుల వరకు వచ్చాయి. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఉదయ్‌కుమార్ చికిత్స పొందుతుండగా కాల్పులు జరిపిని శశికుమార్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. కాగా ఉదయ్‌కుమార్‌పై కాల్పులు జరిపింది డాక్టర్ శశికుమారేనని పోలీసుల దర్యాప్తులో తేలిన నేపథ్యంలో గురువారం మోయినాబాద్‌లో శశికుమార్ కారును పోలీసులు సీజ్ చేశారు. కారులో నుంచి సూట్ కేసు, 14 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కొన్ని వస్తువులు శశికుమార్ కుటుంబీకులకు అప్పగించినట్టు పోలీసులు తెలిపారు. కాగా శశికుమార్ మృతదేహం వద్ద లభించిన రంపం, కొడవలి, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని సెంట్రల్ జోన్ డిసిపి కమలాసన్ రెడ్డి తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వచ్చిన తరువాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఆయన చెప్పారు. నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని హిమాయత్‌నగర్‌లో సంచలనం రేకెత్తించిన కాల్పుల ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న డాక్టర్ ఉదయ్‌కుమార్ కోలుకుంటున్నాడని, ఆయన పరిస్థితి కొంత మెరుగుపడినా పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని డిసిపి కమలాసన్ రెడ్డి వివరించారు. ఈ కేసులో నగరానికి చెందిన మరో నలుగురు తెరపైకి వచ్చారని, ఆ నలుగురిని విచారిస్తామని తెలిపారు. అదేవిధంగా శశికుమార్ స్నేహితురాలు చంద్రకళను నారాయణగూడ పోలీసులు విచారిస్తారని డిసిపి తెలిపారు. చంద్రకళతో పాటు లారెల్ ఆస్పత్రికి చెందిన మిగిలిన డాక్టర్లను కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తోందని, అసలు వైద్యుల వివాదం ఎందుకు వచ్చింది, వాటాల వివాదం ఏమిటని విషయాలపై కూడా నారాయణగూడ పోలీసులు తెలుసుకుంటారు. వైద్యుల మధ్య ఏర్పడిన తగాదాపై పూర్తి సమాచారం రాబట్టేందుకు ఒ బృందాన్ని రంగంలో దింపామని త్వరలో శశికుమార్ ఆత్మహత్య, డాక్టర్ ఉదయ్‌కుమార్‌పై జరిపిన కాల్పుల ఉదంతం తేటతెల్లమవుతుందని డిసిపి కమలాసన్ రెడ్డి వివరించారు.

దిక్కుతోచని టి.టిడిపి

వరుస వలసలతో ఒత్తిడి మిగతావారిపైనా తెరాస పాచికలు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 11:తెలంగాణలో కొన ఊపరితో ఉన్న టిడిపిని రక్షించుకోవడానికి టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రయత్నిస్తుంటే అదే సమయంలో టిడిపిలో మిగిలి ఉన్న నాయకులను సైతం పార్టీలో చేర్చుకోవడానికి టిఆర్‌ఎస్ నాయకత్వం ప్రయత్నిస్తోంది. పార్టీలో చేర్చుకోవడం కోసం తనను ఓటుకు నోటు కేసులో ఒత్తిడి తీసుకు వస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తెలిపారు. ఎమ్మెల్యేలపై ఉన్న పాత కేసులను తిరగదోడుతున్నారని టిడిపి నాయకులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం జరిగి, టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం కలిగించేందుకు చంద్రబాబు టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి కాలం ఉండదు, మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తాయి, మనం అధికారంలోకి వస్తామని ప్రకటించారు. రెండేళ్లు గడవక ముందే అధికారం మాట దేవుడెరుగు సగం కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు టిడిపిని వీడి వెళ్లారు. 15 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే తొమ్మిది మంది పార్టీ మారారు. మిగిలిన ఆరుగురిలో ఆర్ కృష్ణయ్య తనకు టిడిపితో సంబంధం లేదని, తానెప్పుడూ టిడిపి జెండా మోయలేదని ప్రకటించారు. ఇక మిగిలింది ఐదుగురు ఎమ్మెల్యేలు. వీరిలో రేవంత్‌రెడ్డి ఒక్కరే పార్టీలో చురుగ్గా ఉంటున్నారు. జిల్లాల్లో ఓటమి కన్నా గ్రేటర్ హైదరాబాద్‌లో ఓటమి పార్టీ శ్రేణులను మానసికంగా బాగా దెబ్బతీసింది. ఈ పరిస్థితిని టిఆర్‌ఎస్ తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటూ మిగిలిన టిడిపి ఎమ్మెల్యేలపై మానసికంగా ఒత్తిడి తీసుకు వస్తోంది. రేవంత్‌రెడ్డి మినహా మిగిలిన ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారుతారు అనే ప్రచారం పార్టీలో బలంగా ఉంది. తాను పార్టీ మారేది లేదని మాగంటి గోపీనాథ్, అరెకపూడి గాంధీలు ప్రకటించారు. అయితే మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉందని ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఆ దిశగా కొందరు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ జిల్లాలోని టిడిపి శ్రేణులను, నాయకులను టిఆర్‌ఎస్‌లోకి చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు జిల్లా టిడిపిలో పట్టుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని తొలుత తుమ్మలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. తుమ్మల నాగేశ్వరరావు టిడిపిలో తనకున్న పాత పరిచయాలతో వారిని టిడిపిలోకి ఆహ్వానిస్తున్నారు. గతంలో కలిసి పని చేసిన వారే ప్రస్తుతం టిఆర్‌ఎస్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నందున పార్టీలో చేరే నాయకులు సైతం సానుకూలంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేలతో పాటు పలువురు టిడిపి నాయకులు టిఆర్‌ఎస్‌లోకి రావడానికి తుమ్మల నాగేశ్వరరావు ప్రయత్నించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ రెండు ప్రాంతాల్లో మిగిలి ఉన్న కొద్ది మంది టిడిపి నాయకులను సైతం టిఆర్‌ఎస్‌లో చేర్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.